SKLM: ఇచ్చాపురం – జాదుపూడి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని మగ వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు పలాస జీఆర్పీ హెచ్.సి సోమేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని వయసు సుమారుగా 35 నుండి 40 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440 627 567 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.