SKLM: పాతపట్నం మండలం కాపు గోపాలపురం గ్రామానికి చెందిన రేగేటి రాజేశ్(28) అనే యువకుడు మంగళవారం గుణుపూర్ నుంచి రౌర్కెల వెళ్తుండగా రైలు కిందపడి మృతి చెందాడు. పర్లాకిమిడి-పాతపట్నం రైల్వేస్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.