AP: విశాఖలో భారీ ఆన్లైన్ స్కామ్ గుట్టురట్టు అయింది. ఆన్లైన్ బెట్టింగ్, టాస్క్‌ల పేరిట ముఠా మోసాలకు పాల్పడుతున్నారు. అధిక లాభాల పేరిట జనాలను ట్రాప్ చేశారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టారు. కాల్సెంటర్లో నలుగురు యువతులు సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా సాయిరాం, సూర్యమోహన్‌ను గుర్తించి వీరితో పాటు ల్యాప్‌టాప్‌లు, చెక్కుబుక్కులు, సిమ్స్ స్వాధీనం చేసుకున్నారు.