VZM: కొమరాడ మండలంలో చంద్రంపేటకి చెందిన గార సింహగిరి (45) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. కొమరాడ పోలీసులు స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. సింహగిరి గురువారం బహిర్భూమికి వెళ్లి చెరువు వద్ద కాలుజారి పడిపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు చెప్పారు. ఈయన తెలంగాణలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.