తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రత కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు.. నస్రల్లా హతం వార్తల వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హెజ్బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.