• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత

KRNL: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సోమవారం అత్యధికంగా కర్నూలులో 43, నంద్యాల, కడప, విజయవాడ, గుంటూరులలో 42 డిగ్రీల వేడి నమోదైంది. అనంతపురం, గోదావరి జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

April 14, 2026 / 06:27 AM IST

విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

విశాఖలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు 2,474 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకపోవడం-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్-112, ఓవర్ స్పీడ్-223, సెల్‌ఫోన్ వినియోగం-19, లైసెన్స్ లేకపోవడం-6, మైనర్ డ్రైవింగ్-2, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవ్-47, ఎంవీ యాక్ట్ ఉల్లంఘనలు-501 కేసులు నమోదయ్యాయి.

April 14, 2026 / 06:15 AM IST

వీఏఓ లకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం గంట్యాడ మండలం రామవరం గ్రామంలో గజపతినగరం నియోజకవర్గంలోని VAO లకు సెల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్‌ ఫోన్లు ప్రభుత్వం అందించడం వలన పొదుపు సంఘాలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రజలకు, పొదుపు సంఘాలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

April 14, 2026 / 06:05 AM IST

గొర్రెల కాపరుల సమస్యలపై దేవేంద్రప్ప భరోసా

KRNL: కూడేరు వద్ద ఆదోనికి చెందిన కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప గొర్రెల కాపరులతో ఇవాళ సమావేశమయ్యారు. ఎండాకాలంలో మేత, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కాపరులు వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని సీఎంకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. దళారుల దోపిడీ, మృగాల బెడదపై కూడా స్పందించి ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అందిస్తోందన్నారు.

April 13, 2026 / 10:13 PM IST

అనాధాశ్రమంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

PLD: రాజుపాలెం మండలం కొండమోడులోని దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనాధాశ్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు నరసింహారావు, మస్తాన్రావు, గంగాధర్ పాల్గొన్నారు.

April 13, 2026 / 10:03 PM IST

జాతరకు 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ASR: చింతపల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. రేపటి నుంచి 17 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చైన్‌స్నాచింగ్, బైక్ రేసింగ్, మద్యం అల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 13, 2026 / 10:00 PM IST

‘ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు’

VZM: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 50 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 7 దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

April 13, 2026 / 10:00 PM IST

రేపు ఆత్మకూరుకు రానున్న మంత్రి ఆనం

NLR: రేపు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.

April 13, 2026 / 10:00 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.12 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,12,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 198 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 12 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2084 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

April 13, 2026 / 10:00 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు

సత్యసాయి: కదిరి పట్టణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 13, 2026 / 10:00 PM IST

ఘనంగా టీడీపీ టౌన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో టీడీపీ టౌన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పండ్రాజు సాంబయ్య, ఇతర కమిటీ సభ్యులతో, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాలను అందజేశారు. నేడు ప్రమాణస్వీకారం చేసిన నాయకులు పదవులను బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే రాము అన్నారు.

April 13, 2026 / 09:42 PM IST

భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: జేసీ

SKLM: పోలాకిలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పోలాకిలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న అటవీ భూముల సమస్య వలన మత్స్యకారుల ఇబ్బందులు పడుతున్నట్లు నరసన్నపేట MLA రమణమూర్తి జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ జేసీ రెవెన్యూ, అటవీ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

April 13, 2026 / 09:30 PM IST

రేషన్ డీలర్ల అధ్యక్షుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

NTR: విజయవాడ రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న రేషన్ డీలర్ల అధ్యక్షుడు కాగిత కొండాను మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాగిత కొండాకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. దేవుడి దయతో కాగిత కొండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

April 13, 2026 / 09:30 PM IST

బస్ స్టేషన్‌లో పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం

VSP: APSRTC రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్‌లో పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కోసం ఇండోర్ ప్లాంట్స్ పెంపొందిస్తున్నామని తెలిపారు. బెంచీలు, కుర్చీలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీటీఎం కె.పద్మావతి, ఏటీఎం బాపిరాజు, ఏఎం ఎస్‌ఎస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 09:30 PM IST

పౌష్టికాహార విలువలు గురించి అవగాహన కార్యక్రమం

ASR: పిల్లల్లో పోషణ, ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై దృష్టి సాధించాలని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాజేంద్రపాలెం సెక్టార్ పరిధిలోని రేవళ్ల గ్రామ సచివాలయంలో 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు స్థానికంగా లభ్యమయ్యే పౌష్టికాహార విలువలు గురించి అవగాహన కల్పించాలన్నారు.

April 13, 2026 / 09:30 PM IST