• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చినభోగిలిలో సంచార వైద్య సేవలు

PPM: సీతానగరం మండలం చినభోగిలిలో బుధవారం 104 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 45 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLHP నవీన్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో తిరగడం పూర్తిగా నివారించాలన్నారు.

April 8, 2026 / 05:14 PM IST

రెవెన్యూ అధికారులతో జేసీ సమీక్ష

AKP: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవలలో పారదర్శకత, సమయపాలన పాటించాలన్నారు. అలాగే, నాలుగవ విడత జిల్లాలో జరుగుతున్న భూసర్వేను వేగవంతం చేయాలన్నారు.

April 8, 2026 / 05:11 PM IST

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల (PTG) పాఠశాలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజన మెనూను పరిశీలించారు. విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు, పల్లీ చీక్కీలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

April 8, 2026 / 05:11 PM IST

ఖరీఫ్ సాగుపై కలెక్టర్ కీలక సమీక్ష

SS: జిల్లాలో సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగు విస్తీర్ణాన్ని 10 శాతం పెంచాలని, 15 శాతం వృద్ధిరేటు సాధించాలని సూచించారు. వరికి నుంచి మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు.

April 8, 2026 / 05:06 PM IST

పట్టెమ్మ చెరువులను పరిశీలించిన కలెక్టర్

ELR: ఉంగుటూరు (మం) నాచుగుంటలో ఉన్న పట్టెమ్మ చెరువును బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు MLA ధర్మరాజు పరిశీలించారు. చెరువును మరింత అభివృద్ధి చేసి, దీర్ఘకాలికంగా గ్రామానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీడీవో మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 05:03 PM IST

త్వరలోనే అన్న క్యాంటీన్‌ ప్రారంభం: మంత్రి

ATP: ఉరవకొండ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను, వసతులను స్వయంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలోనే ఈ క్యాంటీన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.

April 8, 2026 / 05:01 PM IST

వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలను పరిశీలిన

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు ఆదేశించారు. బుధవారం సుంకేసుల, ఇడుపూరు, దేవరాజుగట్టు కాలనీలను పరిశీలించిన ఆమె, జంగిల్ క్లియరెన్స్, మిగిలిన సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా నిధులు అందిన వెంటనే పంపిణీ చేయాలన్నారు.

April 8, 2026 / 05:00 PM IST

ఎస్సీ సమస్యలపై చర్చ

CTR:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్, కార్యదర్శి చిన రాములు ఐఏఎస్‌లను జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గాల సమస్యలు మరియు వారి అభివృద్ధిపై చర్చించారు. ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్డైరెక్టర్ బాబు పాల్గొన్నారు.

April 8, 2026 / 04:45 PM IST

అర్హులందరికీ టిడ్కో ఇల్లు కేటాయిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

E.G: ఇళ్లు లేని అర్హులందరికీ త్వరలోనే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ & రెవెన్యూ అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నాటికి మెయిన్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు.

April 8, 2026 / 04:43 PM IST

నన్నయ్య వర్సిటీలో వైద్య శిబిరం

W.G: తాడేపల్లిగూడెం అధికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం మెడికల్ క్యాంపును ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అకీరా వైద్య సిబ్బంది సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

April 8, 2026 / 04:42 PM IST

‘ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలపై విచారణ చేయాలి’

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి లంచం ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఇవాళ నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేస్తూ.. లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశముందని హెచ్చరించారు. షాహీ జామియా మసీదులో ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని సూచించారు.

April 8, 2026 / 04:40 PM IST

తల్లాపురం పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం

ELR: ఉంగుటూరు (M) తల్లాపురం పాఠశాల HM నల్లా నాగేంద్ర ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం బుధవారం జరిగింది. ఉంగుటూరు MEO నెం1. రవీంద్ర భారతి చేతులమీదుగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు 1వ తరగతిలో చేరడానికి 8 మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తలిదండ్రులు పాల్గొన్నారు.

April 8, 2026 / 04:36 PM IST

ప్రజావేదికలో వినతులు స్వీకరించిన హోం మంత్రి అనిత

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

April 8, 2026 / 04:31 PM IST

15 గ్రామాలకు ప్రత్యేక అధికారులు

KRNL: హాలహర్వి మండలంలోని 15 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో వరలక్ష్మి ఇవాళ తెలిపారు. బాపురం, కామినహల్, మెదేహలకు బీ.లక్ష్మీనారాయణ, బెవినహల్ తదితర గ్రామాలకు కే.శ్రీనివాసరెడ్డి, హాలహర్వి పరిధిలోని గ్రామాలకు పీ.రామాంజినేయులు, మిగిలిన గ్రామాలకు వరలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల అభివృద్ధి పనులు సమర్థంగా నిర్వహించాలన్నారు.

April 8, 2026 / 04:28 PM IST

‘అమరావతి ఒక అంతులేని దోపిడి’

SKLM: అమరావతి ఒక అంతులేని దోపిడీ అని, రాజధానిగా ‘మావిగన్’ మాత్రమే ఆచరణ సాధ్యమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి రూ. 401 కోట్లు ఖర్చు చేశారని, ఇది దోపిడీకి నిదర్శనం అని అన్నారు.

April 8, 2026 / 04:28 PM IST