ASR: జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతారని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అన్నారు. ముఖ్యంగా పిల్లలు, చిన్నారులను జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం కంఠారం సెక్టార్ పరిధిలోని బకులూరు, బాలారం అంగన్వాడీ కేంద్రాల్లో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు.
KRNL: ఏప్రిల్ 14న ఎమ్మిగనూరు MRO కార్యాలయం ఆవరణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సభ జరగనుంది. ఈ సందర్భంగా దళిత, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జయంతి కమిటీ నేతలు శుక్రవారం పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కమిటీ నేతలు తెలిపారు.
కృష్ణా: జాతీయ సర్వే దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ బాలాజీ నిన్న రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడి, ఉత్సాహంగా ఆరోగ్యకరంగా జీవిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించారు.
PPM: విలేజ్ సర్వేయర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సర్వే శాఖ ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సర్వేయర్ల సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల పనితీరు చూసి అన్ని శాఖల అధికారులు ప్రశంసిస్తున్నారన్నారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతే సంబంధిత వైద్యులకు నోటీసులు ఇవ్వాలని జేసీ సంజనా సింహ ఆదేశించారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రక్తం అందించడంలో జరిగిన పొరపాటుపై వివరాలు తెలుసుకున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి ఎస్టీ, ఎస్సీ కాలనీలో జరుగుతున్న సోలరైజేషన్ పనులను సీజీఏం ఐ. పీ.సి ఉమాపతి, జనరల్ మేనేజర్ విజయన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ఏ విధంగా జరుగుతుందో పరికరాలు నాణ్యత వాడుతున్నారా లేదా అని ఆరా తీశారు. కాలనీలో ఉన్న ప్రజలకు సొలరైజేషన్ పథకం గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కాలనీలో బస చేసి, స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతలు, రాత్రి గస్తీ, స్థానిక మౌలిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ పరిశ్రమ వద్ద శుక్రవారం జరగాల్సిన సీపీఐ రైతు ధర్నా వాయిదా పడింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎస్పీ, యాజమాన్యం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఇవాళ మంత్రి సహకారంతో యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలన్నారు.
KRNL: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
CTR: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎస్.కె రబ్బానీ భాషా ఓ ప్రకటనలో తెలిపారు. కావున, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, బీసీ డైరెక్టర్స్, బీసీ సంఘాల నాయకులు, అధికారులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు.
W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ‘భారతదేశ జనాభా గణన 2027’ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
TPT: తిరుపతి రూరల్ చెర్లోపల్లి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అంత్యక్రియల నేపథ్యంలో కాసేపు ఆందోళన రేపింది. చెర్లోపల్లి రజకుల కాలనీకి చెందిన రాధాకృష్ణయ్య మృతి చెందాడు. పెట్రోల్ బంకు పక్కనే ఆయనకు చెందిన స్థలం ఉండటంతో అక్కడే దహనక్రియలు చేశారు. ఇళ్లు, పెట్రోల్ బంకు వద్ద శవాన్ని కాల్చడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
VZM: సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్‌కి వెళ్లి ZP సమావేశానికి హాజరు కాలేకపోతే దానిని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి MLAలు మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా అని శ్రీనివాసరావును మీడియా ముఖంగా ప్రశ్నించారు.