• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

విజయనగరం: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామం రెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 21/11,13,15 విస్తీర్ణం 1.50 సెంట్లు భూమిలో మండల తహసీల్దార్ రమాలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో సుధీర్, సర్వేయర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును పెట్టారు. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

May 31, 2026 / 09:14 AM IST

కుక్కునూరులో కానిస్టేబుల్ సస్పెండ్..!

ELR: కుక్కునూరు మండలంలో వివాహితను వేధించిన ఘటనలో కానిస్టేబుల్‌పై వేటు పడింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు అరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

May 31, 2026 / 09:13 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే ?

SKLM: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. స్కిన్‌‌తో కూడిన చికెన్ కేజీ రూ.210, స్కిన్‌ లెస్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ.700 ఉండగా, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.

May 31, 2026 / 09:12 AM IST

విద్యుత్ దీపాల అలంకరణ.. యువకుడికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలంలో, సిద్ధమ్మగారిపల్లెలోని రాముల గుడిలో శనివారం విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేస్తున్న అరుణ్ (20) అనే యువకుడు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం, బసినికొండకు చెందిన అరుణ్, పూజల నేపథ్యంలో గుడి పైకి ఎక్కి లైట్లు అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

May 31, 2026 / 09:11 AM IST

ఘనంగా చౌడేశ్వరి మాతకు పౌర్ణమి దీపోత్సవం

KDP: వల్లూరు మండల పరిధిలోని దుగ్గాయ పల్లెలో వెలసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో శనివారం అమ్మవారికి పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారి మూలవిరాట్ కు, ఉత్సవమూర్తికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.మహిళలు రాత్రి దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

May 31, 2026 / 08:49 AM IST

‘ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్’

W.G: ఉపాధి హామీ పనుల్లో ముఖ ఆధారిత ఫేస్ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, కౌరు పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మొగల్తూరులో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాత పద్ధతిలోనే మాన్యువల్ మస్తర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

May 31, 2026 / 08:42 AM IST

తగ్గుముఖం పట్టిన నాన్ వెజ్ ధరలు

ఎన్‌టీఆర్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రూ. 280- 300 ఉన్న చికెన్ కేజీ ధర ప్రస్తుతం రూ. 260కు చేరింది. చేపలు కేజీ రూ.150, మటన్ కేజీ రూ.1000కు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. అధిక ఎండల ప్రభావంతో చికెన్‌కు డిమాండ్ తగ్గినట్లు సమాచారం.

May 31, 2026 / 08:39 AM IST

విద్యార్థులు, తల్లిదండ్రులకు SP కీలక హెచ్చరికలు

TPT: తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శక్తి టీమ్ విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళా, బాలల భద్రతపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ ప్రాముఖ్యత, ఆన్‌లైన్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.

May 31, 2026 / 08:37 AM IST

సీఏ నిఖిల్‌ను అభినందించిన మంత్రి లోకేష్

GNTR: ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా రానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన జీఎస్టీ, ఇతర రిజిస్ట్రేషన్లు, అనుమతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన మంగళగిరి సీఏ మద్ది నిఖిల్‌ను మంత్రి నారా లోకేష్ శనివారం ఉండవల్లి నివాసంలో అభినందించారు. రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుందని లోకేష్ తెలిపారు.

May 31, 2026 / 08:37 AM IST

ప్రమాదకరంగా మ్యాన్ హోల్.. స్థానికుల ఆందోళన

BPT: చీరాల మున్సిపల్ పరిధిలోని జిల్లా క్రీడా ఆడిటోరియం ఇండోర్ స్టేడియం సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద ఉన్న మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ మూత దెబ్బతినడంతో అక్కడ సంచరించే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

May 31, 2026 / 08:34 AM IST

ఏసీబీ ముసుగులో డబ్బులు దండుకున్న కేటుగాళ్లు

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో శనివారం ఏసీబీ అధికారుల పేరుతో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోల నుంచి కేటుగాళ్లు నగదును దోచేశారు. ఏసీబీ అధికారులమని తమకు నగదు వేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించడంతో వీఆర్వో యేసయ్య రూ.1.50 లక్షల నగదును నకిలీ ఏసీబీ అధికారులకు ఫోన్ పే ద్వారా పంపాడు. తర్వాత విషయాన్ని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

May 31, 2026 / 08:33 AM IST

నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. జిల్లా ఎస్పీ హెచ్చరికలు

VZM: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా SP దామోదర్‌ శనివారం హెచ్చరించారు. బెట్టింగ్‌లను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వీటివల్ల యువత ఆర్థికంగా, విద్యాపరంగా...

May 31, 2026 / 08:32 AM IST

హైవే పై ప్రమాదం.. తల్లీకొడుకు గాయాలు

ATP: పెద్దవడుగూరు మండలం అప్పెచర్ల గ్రామ సమీపంలోని 67 హైవేపై బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు. తల్లి భవాని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 31, 2026 / 08:30 AM IST

భోగాపురం ఎయిర్పోర్ట్‌కు బస్సులు..!

NTR: రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈవీ బస్సులను విస్తరించి, పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

May 31, 2026 / 08:17 AM IST

జనగణన వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

ELR: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని 48 గంటల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన జూమ్ సమావేశంలో ఆమె జనగణన పురోగతిని సమీక్షించారు. 2011 జనాభా గణాంకాలతో పోల్చి చూస్తూ.. వ్యత్యాసాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా గణన చేపట్టాలని సూచించారు. శాశ్వత వలసదారులను సక్రమంగా నమోదు చేయాలని ఆమె అన్నారు.

May 31, 2026 / 08:15 AM IST