• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం

కోనసీమ: నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం పవర్ కట్ అమల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు కోనసీమ జిల్లా కేంద్రంలో పాటు మామిడికుదురు, పాసర్లపూడి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అప్పన్నపల్లి, పెదపట్నం, మొగలికుదురు గ్రామాలతో పాటు రాజోలు మండలం తాటిపాక గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు.

April 22, 2026 / 06:08 AM IST

మహారాష్ట్రలో పర్యటిస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహారాష్ట్రలో రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సుప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లోరా సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ స్వామిని దర్శించుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగింది. 

April 22, 2026 / 06:06 AM IST

ఒకేరోజు మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు.. భారీగా పంట నష్టం

NTR: కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినట్లు ఫైర్ స్టేషన్ ఎస్‌ఎఫ్‌వో శివారెడ్డి తెలిపారు. వీరులపాడు మండలం నరసింహారావుపేటలో సుబాబుల్ తోట దగ్ధమై సుమారు లక్ష రూపాయల పంట నష్టం జరిగినట్లు చెప్పారు. అలాగే గండేపల్లిలో మొక్కజొన్న పంట, వేములపల్లిలో మరో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 21, 2026 / 10:02 PM IST

నైట్ బీట్ పెంచండి.. పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశం

E.G: రాజమండ్రి సిటీ 46వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. మహిళలు తమ సమస్యలను విన్నవించారు. రాత్రి వేళల్లో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులు, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు నైట్ బీట్ పెంచాలని ఆదేశించారు.

April 21, 2026 / 10:00 PM IST

ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్

KDP: ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిందని ప్రమాదకరంగా మారకముందే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

April 21, 2026 / 09:36 PM IST

తణుకులో మద్యం దుకాణాల్లో తనిఖీలు

W.G: తణుకులోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఇవాళ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం తణుకు ఎక్సైజ్ స్టేషన్ సందర్శించి స్టేషన్లో కేసుల దర్యాప్తులో పురోగతి, అక్రమ మద్యాన్ని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

April 21, 2026 / 09:31 PM IST

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: సీఐ

ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్బంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.. యువత థ్రిల్ కోసం బైక్‌‌లను అతివేగంగా నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ప్రయాణ సమయంలో హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.

April 21, 2026 / 09:30 PM IST

సాయి నేత్రాలయం ప్రారంభించిన ఎంపీ లావు

PLD: నరసరావుపేట అరండల్‌పేటలో డా. దండమూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన సాయి నేత్రాలయం–లేజర్ & ఫాకో సెంటర్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రులు మరింత అవసరమని పేర్కొన్నారు.

April 21, 2026 / 09:19 PM IST

ఎరువుల దుర్వినియోగం జరగకూడదు: కలెక్టర్

NDL: ఎరువుల దుర్వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో టాస్క్ ఫోర్స్ సమావేశంలో యూరియా పరిశ్రమల వైపు మళ్లకుండా నిఘా పెంచాలని సూచించారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు.

April 21, 2026 / 09:04 PM IST

‘స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం’

కోనసీమ: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. మండపేట MPDO కార్యాలయంలో జరిగిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

April 21, 2026 / 09:00 PM IST

చోలసముద్రంలో పోలీసుల అవగాహన సమావేశం

సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోలసముద్రం గ్రామంలో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి చోరీల నివారణ, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, శారీరక దాడులు, భూ వివాదాలపై సూచనలు ఇచ్చారు. సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

April 21, 2026 / 09:00 PM IST

‘ఎస్సీ కాలనీలో అమ్మవారి ఘటాలు తిరగాలి’

పార్వతీపురం పట్టణం కొత్తవలసలో కొత్త పోలమ్మ పండుగ వివాదం రేపుతోంది. ఈనెల 27 నుంచి 29 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా, అమ్మవారిని తమ వీధిలోకి తీసుకురావాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. అయితే, అగ్రవర్ణాలకు చెందిన కమిటీ పెద్దలు ఇందుకు నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాలనీ ప్రజలు నిరసన చేపట్టారు.

April 21, 2026 / 08:48 PM IST

‘అధిక దిగుబడులు కోసం శిక్షణ అందించాలి’

ASR: వ్యవసాయ ఆధారిత జిల్లాను మరింత బలోపేతం చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సుగంధ ద్రవ్యాల శాఖల సమన్వయంతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంటలను పండించేలా చూడాలన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. దిగుబడులు పెంచేందుకు రైతులకు శిక్షణలను అందించాలన్నారు.

April 21, 2026 / 08:47 PM IST

‘మహిళా సంఘాల పురోగతికి వీవోఏలే వెన్నెముక’

SKLM: మహిళా సంఘాల ఆర్థిక పురోగతికి వీవోఏలు వెన్నెముక వంటి వారని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఈ మేరకు మంగళవారం పలాస టీడీపీ కార్యాలయంలో 142 వీవోఏలకు ఉచితంగా మొబైల్ ఫోన్లను ఎపంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పొదుపు సంఘాల లావాదేవీలు, రికార్డుల నిర్వహణను ఆన్‌లైన్ ద్వారా వేగవంతం చేసేందుకు ఈ స్మార్ట్‌ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు

April 21, 2026 / 08:36 PM IST

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: కమిషనర్

కాకినాడ నగరంలో దోమల సమస్యను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం కొండయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

April 21, 2026 / 08:34 PM IST