ప్రకాశం: గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80,800 నగదు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ సురేష్ హెచ్చరించారు.
NTR: నందిగామలో వ్యవసాయ అధికారి (టెక్నికల్)గా పనిచేస్తున్న కే. వెంకటేశ్వరరావు కంచికచర్ల ఇంఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన కే. విజయ్‌కుమార్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. కొత్త అధికారితో రైతులకు సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.
అన్నమయ్య: బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన తర్వాత గొడవలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
NDL: నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. సాగునీరు లక్షల ఎకరాలకు అందుతున్నా తమ త్యాగాలు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల రైతుల కోసం చట్టాలు చేస్తూ, దశాబ్దాలుగా పోరాడుతున్న తమ హక్కులపై ప్రభుత్వం మౌనం ఎందుకని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పరిగి ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 తోపుడు బండ్లు, 27 ట్రైసైకిళ్లు, 286 డస్ట్బిన్లను పంచాయతీ వారీగా పంపిణీ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ATP. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు నాయుడుకు MLA జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. సోమవారం యాడికిలో సీఎంను కలిసిన వారు.. బుద్ధుడి విగ్రహంతో కూడిన ప్రత్యేక అమరావతి లోగోను బహూకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలను సీఎం అభినందించారు.
TPT: తిరుపతిలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ స్థాపన, అభివృద్ధిపై నాయకులు ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో 16 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
W.G: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్నోవా కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
AKP: తిమ్మాపురం పంచాయతీ పరిధిలో విద్యుత్ స్తంభాలు, వైరుకు కలిపి రూ.1.90 లక్షలు విద్యుత్ శాఖకు కట్టినా ఇప్పటివరకు పనులు జరగలేదని గ్రామ మాజీ సర్పంచ్ కె సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీధిలైట్లు సౌకర్యం కోసం కట్టి రెండు నెలలు దాటుతున్నా సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
KRNL: పత్తికొండ నియోజకవర్గంలో కోర్ కమిటీలు, అనుబంధ విభాగాల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ తెలిపారు. మిగిలిన గ్రామాల్లో సభ్యుల వెరిఫికేషన్‌ను అధికారిక లింక్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను 2,3 రోజుల్లో పూర్తి చేయాలని, అనంతరం ఐడి కార్డులు అందజేస్తామని తెలిపారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని అన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రాణరక్షణకు అవసరమని సూచించారు. ISI నాణ్యమైన హెల్మెట్లు మాత్రమే వాడాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు పేటలోని టీడీపీ కార్యాలయంలో అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన అందమైన ముగ్గు వద్ద మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు.
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వారి సమస్యలను సావధానంగా విని ఫోన్లు ద్వారా అధికారులతో మాట్లాడారు. కొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ELR: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ. గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి తూర్పు గాలిగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలను శేష వస్త్రాన్ని వారికి సమర్పించారు.
ATP: యాడికిలో జరిగిన జలధార సభలో CM చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గ ప్రగతి నివేదికను స్వయంగా చదివి వినిపించారు. సరిగ్గా పనిచేయని అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ కోరారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆదాయం తగ్గినా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.