CTR: బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామానికి చెందిన కిరణ్ (11) శాంతిపురం మండలంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కిరణ్ శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా విష సర్పం కాటేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందాడు.
NTR: జూన్ 1న జరగనున్న ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఇందిరా గాంధీ స్టేడియం పరిసరాలను ఎంపీ కేశినేని చిన్ని,సెంట్రల్ ఏసీపీ దామోదర్ పోలీసు అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సినీ ప్రముఖులు, వీఐపీలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జూన్ 9న ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటకు చెందిన బోడికే ఓబుల నాయుడు టీడీపీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. గుండెలపై సీఎం చంద్రబాబు ఫొటోను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయనకు చంద్రబాబు కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందని స్థానికులు చెబుతున్నారు.
AKP: ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్పించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సూచించారు. శనివారం నక్కపల్లిలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. పార్టీ సానుభూతి ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలన్నారు.
PLD: కారంపూడి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చినగార్లపాడుకు చెందిన కె. జానీ బాషా (24) కారంపూడి నుంచి వస్తుండగా బ్రహ్మనాయుడు కాలనీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో కింద పడి తలకు బలమైన గాయాలు కావడంతో జానీ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఓ స్థలానికి సంబంధించిన విషయంలో ఖాళీ చేయాలని అధికారులు ముందుగానే నాగరాజుకు నోటీసులు ఇచ్చారు. నాగరాజు పట్టించుకోకపోవడంతో అధికారులు బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా నాగరాజు ఆత్మహత్య ప్రయత్నించాడు.
ATP: అనంతపురం నగరంలో ఉరుముల,మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శకులు వసతి కేంద్రం ఈదురు గాలులకు కుప్ప కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి కేంద్రం కింద ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలోని నూతన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. కూటమి నేతలు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.
KDP: బద్వేలులోని సిద్దవటం రోడ్డులో ఉన్న శివరామకృష్ణ నగర్ 5వ వీధిలో పట్టపగలు చోరీ జరిగింది. బి.నరసింహారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,రూ.1.85 లక్షల నగదు,వెండి వస్తువులను అపహరించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
W.G: పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నటుడిగా, రచయితగా, శతాధిక చిత్రాల దర్శకుడిగా ఆయన సాధించిన ఘనతలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. తన సినిమాల ద్వారా సమాజంలోని లోపాలను ఎండగడుతూ రికార్డులు సాధించి, పాలకొల్లు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.
NDL: టీడీపీ ఆధ్వర్యంలో రెండురోజులు నిర్వహించిన మహానాడులో పాల్గొనడం స్ఫూర్తినిచ్చిందని శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై పార్టీ నాయకత్వం నిర్దేశించిన కార్యాచరణ భవిష్యత్‌కు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల ఆశయ సాధన కోసం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ మరింత బాధ్యతతో పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రకాశం: కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన గ్రంధాలయ భవన నిర్మాణానికి మంత్రి స్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 95 లక్షల వ్యయంతో ఈ గ్రంథాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాలయం అన్ని వసతులతో కొండేపికే ఒక తలమానికంగా నిలవనుందని మంత్రి అన్నారు.
BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో డీఎల్‌డీవో కే. పద్మావతి శనివారం తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలో PGRSలో వచ్చిన కంప్లైంట్లను విచారణ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి నిధులు ఎన్ని కేటాయించారు. జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ELR: పెదపాడు మండలం కొత్తముప్పారులో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగపడుతుందో ఎస్సై ఆర్. శ్రీనివాస్ వివరించారు. యాప్‌లోని SOS బటన్ నొక్కితే చాలు, జీపీఎస్ ద్వారా లొకేషన్ పోలీసులకు చేరుతుందన్నారు. కుటుంబ సభ్యులకు కూడా అలర్ట్ వెళ్లే ఈ యాప్, మహిళలకు రక్షణ కవచమని తెలిపారు.