• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పదేపదే దొంగతనాలు.. ముగ్గురిపై పీడీ చట్టం

KDP: పదేపదే దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిపై పోలీసులు పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. కావటి అరుణపై 16 కేసులు, తొండ పోసమ్మపై 27 కేసులు, తొండ పోతురాజుపై 56 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్ట్ అయ్యి, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు.

April 8, 2026 / 08:46 PM IST

కార్యకర్తలకు అండగా ఉంటా: శైలజనాథ్

ATP: శింగనమల పంచాయతీలో నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ ఐక్యతతో ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

April 8, 2026 / 08:45 PM IST

స్వామివారి సేవలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ చిన్న రాములు ఐఏఎస్, సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు పాల్గొన్నారు.

April 8, 2026 / 08:45 PM IST

‘దోమల నివారణకు దోమ తెరలు వాడాలి’

ASR: దోమల వల్ల మలేరియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని కందమామిడి వద్ద బుధవారం పలువురు ప్రజలకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమల నివారణకు దోమ తెరలు వాడాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

April 8, 2026 / 08:41 PM IST

కానుమోలీలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ

కృష్ణా: బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను నేరుగా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. అర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, మిగతావాటిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సేవలు పారదర్శకంగా అందాలని సూచించారు.

April 8, 2026 / 08:40 PM IST

నన్నయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతారు. వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. వేడుకల ఏర్పాట్లు, వివరాలు వివరించగా, గవర్నర్ రాకతో వర్సిటీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

April 8, 2026 / 08:30 PM IST

గిరిజనులకు మౌలిక వసతులు

PLD: గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక ఆదేశించారు. పీఎం జన్‌మన్, జుగా పథకాలపై నరసరావుపేటలో ఆమె సమీక్షించారు. పీఎం జన్‌మన్ కింద రూ.41.38 కోట్లతో చెంచులకు ఇళ్లు, తాగునీరు, విద్యుత్, టవర్లు ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ లేనిచోట సోలార్ ప్యానెళ్లు అమర్చాలన్నారు. పీఎం జుగా కింద 7 గ్రామాల్లో రూ.18 కోట్లతో పనులు చేపట్టాలన్నారు.

April 8, 2026 / 08:30 PM IST

నెల్లూరులో హైడ్రోపోనిక్ యూనిట్‌ను సందర్శించిన విద్యార్థులు

ప్రకాశం: నెల్లూరులోని ఆరోహ వనం హైడ్రోపోనిక్ యూనిట్‌ను సి.ఎస్.పురం కదిరి బాబు రావు వ్యవసాయ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బీ.ఎస్.సీ (ఆనర్స్) వ్యవసాయ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ‘కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి సాంకేతికత’ కోర్సులో భాగంగా జరిగిన ఈ పర్యటనలో, నిపుణులు డాక్టర్ బసవరాజు హైడ్రోపోనిక్ పద్ధతులపై అవగాహన కల్పించారు.

April 8, 2026 / 08:30 PM IST

‘తాగునీటిని పనులను వేగవంతంగా పూర్తి చేయాలి’

NLR: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేసి అప్పగించాలన్నారు.

April 8, 2026 / 08:28 PM IST

‘2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యం’

కర్నూలు: 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారానికి అధికారులు కృషి చేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై ఛైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే ప్రధాని లక్ష్యమన్నారు.

April 8, 2026 / 08:22 PM IST

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పై సమీక్ష

CTR: జిల్లా సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ ఛైర్మన్ జవహర్ గారితో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పథకాల అమలు, పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ దుడి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పాల్గొన్నారు.

April 8, 2026 / 08:20 PM IST

దత్తిరాజేరులో అగ్నిప్రమాదం

VZM: దత్తిరాజేరు మండలం ఎం. లింగాలవలసలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన కిలారి నాగ, రామారావు, సింగరావ్ కన్నయ్యలకు చెందిన మూడు గడ్డివాములు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 80 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

April 8, 2026 / 08:19 PM IST

నాయుడుపేటలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

TPT: నాయుడుపేటలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 మంది నిందితులు, 2 బాలురను అదుపులోకి తీసుకుని రూ.4.20 లక్షల విలువైన రాగి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 35 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల్లో వీరి ప్రమేయం బయటపడింది. రైతులను లక్ష్యంగా చేసుకునే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

April 8, 2026 / 08:11 PM IST

‘రోడ్లు తవ్వితే చర్యలు తప్పవు’

VSP: మధురవాడలో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంపాలెం ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించారు. 15 రోజుల్లో పూడ్చగలిగితేనే గోతులు తీయాలని, లేకపోతే పనులు ప్రారంభించవద్దని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

April 8, 2026 / 08:11 PM IST

గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత

AKP: గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. గెడ్డపాలెం, కొరుప్రోలు తిమ్మాపురం తదితర గ్రామాల్లో బుధవారం పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. గ్రామాల్లో మురికి కాలువలను తరచూ క్లీన్ చేసి బ్లీచింగ్ వేయాలన్నారు. రహదారులపై చెత్త వెయ్యకుండా గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు.

April 8, 2026 / 08:11 PM IST