PPM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పార్వతీపురం పట్టణం కొత్తవలస శివారులో గల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా MLAమాట్లాడుతూ.. సీఎం భవిష్యత్తులో ప్రజలకు మరెన్నోసేవలు అందించేందుకు ఆయనకు ఆరోగ్యం సహకరించే విధంగా ఉండాలన్నారు.
VZM: సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని MP కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి చందనోత్సవం సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని, స్వామి వారి దివ్య ఆశీస్సులు సీఎం చంద్రబాబు పై చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకుంటూ ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకొన్నట్లు తెలిపారు.
ATP: CM చంద్రబాబు జన్మదినం వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TDP క్రిష్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాస్‌తో కలిసి ఉచిత వీల్ చైర్లను పంపిణీ చేశారు. ప్రజాసేవే పరమోన్నత ధర్మమన్న చంద్రబాబు స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పల్లవి తెలిపారు.
AKP: సీఐటీయూ రాష్ట్ర కౌన్సల్ సభ్యుడిగా అనకాపల్లి జిల్లాకు చెందిన గనిశెట్టి సత్యనారాయణ ఎన్నిక అయ్యారు. నంద్యాలలో ఈనెల 17 నుంచి 19 వరకు రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు గనిశెట్టి సోమవారం తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ASR: చింతూరు డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓగా దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. ఆయన ఎటపాక (M) నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా పని చేస్తున్నారు. ఈ మేరకు పోలవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సరిత ఆదివారం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న పుల్లయ్య బదిలీ అయిన సంగతి తెలిసిందే.
ప్రకాశం: వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం కనిగిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్తూరు ఆంజనేయులు స్వామి దేవస్థానం వద్ద వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికి, దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
E.G: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు.
VSP: అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేడే సాంస్కృతికోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ బాధ్యులు జి.ఎస్. రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ 25న ఉదయం 10 నుంచి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని పాట, నృత్యం, నాటికలతో ప్రతిభ చూపవచ్చని నిర్వాహకులు తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మిపురంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ “సంకల్పం–చైతన్యం అభ్యుదయం 2.0” నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు సీఐ హరి, ఏఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం త్రీటౌన్ పోలీసులు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా నార్కోటిక్స్ డిటెక్షన్ జాగిలం ‘టైగర్’ సహాయంతో ఈ తనిఖీలు చేపట్టారు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పర్యవేక్షణలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు.
KRNL: ఆదోని మండలం మండగిరిలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 9 మంది కార్మికులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వాపోతున్నారు. అధికారులు మాత్రం నిధులు విడుదల చేశామని చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. బ్యాంకింగ్ సమస్య లేక అధికారుల నిర్లక్ష్యమా అన్నది తేలాల్సి ఉంది. బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
సత్యసాయి: CM చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం పురస్కరించుకుని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చంద్రబాబు పేరు మీద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ 76 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
NDL: బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆదివారం ఆళ్లగడ్డ నూతన డీఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి డీఎస్పీని అభినందిస్తూ, విధుల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
PLD: మాచర్ల నియోజకవర్గం తాళ్లపల్లి జడ్పీ పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి హామీల అమలు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.