SKLM: ఇంటింటికి రక్షిత మంచి నీరు అందించండి ప్రభుత్వ లక్ష్యం అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అలమాజీ పేట ప్రధాన నీటి సరఫరా కేంద్రము వద్ద రూ.84 కోట్లతో AIIB, అమృత్ 2.0 ప్రాజెక్టు పైప్ లైన్ పనులకు మంగళవారం ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 23 వార్డులకు ఇంటింటి కొళాయిలు ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు.
TPT: శ్రీకాళహస్తి గుడిలోని కళారాధన వేదిక వద్ద శ్రీ ఆది శంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. ఈవో వెంకటేశులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విశేష పూజలు చేశారు. ఆది శంకరాచార్యులు తన శాంతియుత వేదాంత సందేశంతో ప్రజలకు అనేక బోధనలు చేయడం జరిగిందని ఈవో పేర్కొన్నారు. ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని విస్తరింప చేశారని వెల్లడించారు.
CTR: పుస్తక పఠనంతో వివేకం, విలువలు పెంపొందుతాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ శాఖ ఛైర్మన్ గురువారెడ్డి అన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్‌లను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
PPM: చిన్నారుల తోలి ఆరు సంవత్సరాలు మెదడు, భావీద్వేగ వికాసానికి కీలకమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి అన్నారు. మంగళవారం కలక్టరేట్లో జరిగిన పోషణ పక్వడ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. స్త్రీలకు గర్భధారణ నుంచే పోషకాహారం అవసరమని, జంక్ ఫుడ్‌కు బదులు సంప్రదాయ ఆహారం ఇవ్వాలని సూచించారు.
VSP: విశాఖపట్నం ఆరిలోవకు చెందిన GVMC ఉద్యోగి గౌరి నాయుడు పెదవాల్తేరులోని సహచరురాలి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 12 నుంచి అక్కడే ఉంటున్న ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య ఫిర్యాదు చేయగా, పోలీసులు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VZM: పాత బొబ్బిలి సరే పోలమ్మ తల్లి, గొల్లపల్లి దాడితల్లి అమ్మవార్ల పండుగలు సందర్భంగా ఈనెల 27న శ్రీకళా భారతి ఆడిటోరియంలో జరగనున్న కళా ఉత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. ఈ మేరకు మంగళవారం ఉత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కళా ఉత్సావాలలో కవి సమ్మేళనం, హరికథ, కోలాటం, కర్రసాము, తదితర ఉత్సవాలు జరుగుతాయన్నారు.
AKP: వైసీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. మంగళవారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జెడ్పీటీసీ కాసులమ్మ, మాజీ సర్పంచ్ పిక్కి రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
SKLM: జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వెంట్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటంలో సుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా, ప్రతి పథకం ఆఖరి లబ్ధిదారుడికి చేరేలా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, పారదర్శకమైన పాలన అందిస్తూ ‘వికసిత భారత్’ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
VZM: పాత శ్రీరంగరాజపురం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న దేవస్థాన భూములను వేలం వేయనున్నట్లు ఎండోమెంట్స్ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు సూచించగా, తమకు న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
VZM: రామకృష్ణ నగర్‌లో నివాసముంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలిఇవ్వాలని CPM కార్యదర్శి రెడ్డి శంకర్రావు కోరారు. మంగళవారం TDP జిల్లా కార్యాలయంలో MLA అతిధి గజపతిరాజుకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లగా పాకలలో నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని GO 30 ప్రకారం పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు సహాయం అందించాలన్నారు.
కోనసీమ: గత ఏడాది కంటే ఈసారి ఎండలు పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ నమోదు అవుతుంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డీ హైడ్రేషన్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జనం కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. మండపేటలో కరాచీ సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు, కృష్ణాటాకిస్ రాజారత్న బొండాలు రోడ్‌పై బోండ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
CTR: కుప్పం (M) మల్లనూరు హైస్కూల్ వెనుక వైపు భారీ కొండచిలువ మంగళవారం స్థానికులను హడలెత్తించింది. సుమారు 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ చెట్ల మధ్య బుసలు కొట్టడంతో యువత పట్టుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే సమాచారం ఇస్తే వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదలాలని సూచించారు.
కాకినాడ: సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల రుణాల రద్దు కోసం ధర్నా నిర్వహించారు. జగ్గమ్మగారి పేటలోని 500 టిడ్కో గృహాల లబ్ధిదారులు రూ. 3.5 లక్షల రుణం పేరుతో నెలకు రూ. 4000 చొప్పున 20 సంవత్సరాలు చెల్లిస్తే రూ. 10 లక్షలు అవుతుందని, ఇది తీవ్ర రుణభారమని సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు తక్షణమే రుణమాపీ చేయాలన్నారు.
అనంతపురం: కార్మికులకు బకాయి పడ్డ ఒక నెల జీతం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక కూడలి వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న కార్మికులకు నెల రోజులు అయినప్పటికీ జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి చిన్న కృష్ణాపురం MUP ప్రభుత్వ పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను ఎంఈఓ రాములు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరాలని హెచ్ఎం ధనుంజయరావు,ఉపాధ్యాయులు, వార్డు ఇంచార్జి కూన రాము తదితరులు సూచించారు.పూర్వపు ఉపాధ్యాయులను సన్మానించారు.