AKP: నర్సీపట్నం అయ్యన్న కాలనీలో తలుపులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, 11వ వార్షిక జాతర మహోత్సవాల కరపత్రాలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభమై, 23న విగ్రహ ప్రతిష్ట, 28న జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్పీకర్ ఆకాంక్షించారు.
శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో సహారా ఇండియా ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతూ సహారా పోరాట కమిటీ ప్రతినిధులు DRO విశ్వేశ్వరరావుకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహారా ఇండియా ఖాతాదారులు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించడంలో విఫలమైందని విమర్శించారు. బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారుతోంది. వైసీపీ సిటీ ఇంఛార్జ్‌గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు.
ATP: కనేకల్లు మండలం మాల్యం గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని MLA కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. రామాయణం ద్వారా సమాజానికి ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
NDL: ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. ఎంపీపీ గజ్జల రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు అందరూ తమ శాఖాలకు సంబంధించిన పూర్తి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని ఆటోనగర్ సాంసంగ్ షోరూమ్ వెనుక కొత్తగా నిర్మించిన రేకుల షెడ్డులో పేకాట రాయుళ్లును పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా, పేకాట ఆడుతున్న 48 మంది అరెస్ట్ అయ్యారు. వారివద్ద నుంచి రూ. 1,70,016, 5 కార్లు, 26 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: పెదప్రోలు గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్‌పై గ్రామస్థులు సోమవారం PGRSలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులను అధిక బిల్లులతో దుర్వినియోగం చేస్తున్నారని, కాంట్రాక్ట్ పనుల్లో తనకు అనుకూలమైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వీధి దీపాలు, పన్నుల సమస్యలు నెలలుగా పరిష్కారం కాలేదని వాపోయారు. వెంటనే ఆయనను బదిలీ చేయాలని కోరారు.
KRNL: పెద్దకడబూరు MROగా వలిభాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు. మండల పరిధిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.
VSP: జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రతినిధులు జోన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విక్రయదారులకు గుర్తింపు కార్డులు, భద్రత సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
PPM: పూర్ణపాడు-లాబేసు వంతెన పనులను త్వరగగతిన పూర్తి చేయాలని సీపీఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కొమరాడ మండల కేంద్రంలో ఆయన ధర్నాను నిర్వహించారు. కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంతెనను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
AKP: పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన లంక వరలక్ష్మికి మంజూరైన రూ.65,594 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు మహేష్‌కు సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరమని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
BPT: రేపల్లె నియోజకవర్గంలోని నగరం ఎస్టీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 7.7 లక్షల కనెక్షన్లను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
VZM: ఎల్.కోట మండలం రొంగలవానిపాలెం గ్రామంలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలోని రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. స్వయంగా రోగులను అడిగి రోగులకు డాక్టర్లు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యశాలకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.
SKLM: నందిగాం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు.