GNTR: రాజధాని పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు సరైన స్పెల్లింగ్ వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై అన్ని అధికారిక ఉత్తర్వులు, రికార్డుల్లో ‘Amaravati’ అని మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. కొందరు ‘Amaravathi’ అని తప్పుగా రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
CTR: చిట్రెడ్డి పల్లె గ్రామంలో కన్నుల పండువగా నడివీధి గంగమ్మ జాతర ప్రారంభమైనది. నడి వీధిలో గంగమ్మను అత్యంత సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఇంటి వద్ద నుంచి అష్టదిగ్పాలకులలో వెలసిన అమ్మవార్లకు జంతు బలులు సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామంలో సందడి నెలకొంది.
KDP: కలసపాడు పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సుబహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 8 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ATP: శింగనమల నియోజకవర్గం నార్పలలో గ్రామ సంఘ సహాయకులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి 200 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ శక్తి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు ఈ ఫోన్లు దోహదపడతాయని వివరించారు.
NDL: నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్తికొండలో CITU ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ.. 17న నంద్యాలలో భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని, ఈ మహాసభల్లో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విభజన పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరుకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేశారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు వారు పేర్కొన్నారు.
ASR: జీకేవీధి మండలం నిమ్మలపాలెం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో పెదవలస గ్రామానికి చెందిన దేశగిరి కిషోర్ కుమార్, మరో గ్రామానికి చెందిన చిలకల అబ్రహం చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చింతపల్లిలో తరలించారు.
AKP: జాతీయ అగ్నిమాపాకదళ దినోత్సవం వారోత్సవం సందర్భంగా ఏటి గైరంపేట వాసవి వనిత మని క్లబ్ సభ్యులు కేబినెట్ సెక్రటరీ యలమర్తి పరమేశ్వరరావు మంగళవారం బలిఘట్టంలో ఫైర్ స్టేషన్ సిబ్బందికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ యలమర్తి పరమేశ్వరరావు జోన్ ఛైర్మన్ పోలిశెట్టి సంతోష్ కుమార్ మరియు పి యస్ టిలు పల్గొన్నారు
కృష్ణా: గుడ్లవల్లేరు మండల కట్టవానిచెరువు గ్రామంలోని SWPC షెడ్‌ను ఎంపీడీవో ఇమ్రాన్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్‌లో జరుగుతున్న పనితీరును పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. షెడ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకుని, పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
CTR: తవణంపల్లి(M) కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని – కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: అనంతపురం రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ తన భార్య తేజస్వినిపై చాకుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో, ఆమె పనిచేసే బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లి రాజేష్ గొడవపడ్డాడు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అన్నమయ్య: జనగణన-2027లో భాగంగా స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఖచ్చితమైన జనగణనకు సహకరించాలని కోరారు.
NDL: గడివేములలో పేట లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం పురస్కరించుకుని ఈ నెల 28న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడో బహుమతి రూ.30 వేలు, నాలుగవ బహుమతిగా రూ.20 వేలు ఇవ్వనున్నారు.
KRNL: హోళగుంద మండలం సులువాయి గ్రామంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరు గడ్డివాములు మంటల్లో కాలిపోయాయి. ఈరన్న, వసంతకుమార్, రమేష్, పరుశురాంలకు చెందిన గడ్డివాములు అని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగిందిని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. జనసేనలో కీలక నేతగా ఉన్న ఆయన గతంలో బీఆర్ఎస్‌లో చేరారు. పవన్‌తో తాజా భేటీతో ఆయన తిరిగి జనసేనలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.