• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీ సోమేశ్వర స్వామి అలంకరణ కార్యక్రమం

W.G.రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వరి కంకెలతో విశేష అలంకరణ చేశారు. క్షేత్ర ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు, అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.

May 30, 2026 / 03:12 PM IST

‘అఖిలభారత ప్రశ్నావళిలో ఆదివాసీలను గుర్తించండి’

NDL: డోన్ పట్టణంలోని ఈరోజు పోస్ట్ ఆఫీస్ నందు గిరిజనులకు విద్యా, వైద్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన కుటుంబానికి రెండు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించాలన్నారు. ఏపీ గిరిజన సమాఖ్య పోస్టు కార్డు ఉద్యమం ద్వారా ఈ రోజు రాష్ట్రపతికి 100 పోస్ట్ కార్డులు పంపించారు.

May 30, 2026 / 03:11 PM IST

జగ్గయ్యపేటలో రక్షిత త్రాగునీటి ప్లాంట్‌లు ప్రారంభం

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రక్షిత త్రాగునీటి ప్లాంట్‌ను అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ. 5.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ రక్షిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

May 30, 2026 / 03:11 PM IST

వేరుశనగ కాయల నమోదు ప్రారంభం : AO

KDP: వేముల మండలంలో రైతులకు 40% సబ్సిడీపై వేరుశనగ కాయల పంపిణీ కోసం నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభించినట్లు ఏవో ఓబులేసు తెలిపారు. మండలానికి 260 క్వింటాళ్ల వేరుశనగ కాయలు మంజూరయ్యాయన్నారు. క్వింటాల్ ధర రూ.10,200 కాగా, రూ. 4,080 సబ్సిడీ లభించడంతో రైతులు రూ. 6,120 చెల్లించాలన్నారు. వేరుశనగ సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.

May 30, 2026 / 03:11 PM IST

కూటమిలో మాజీ కార్పొరేటర్ వ్యాఖ్యలపై చర్చ

విశాఖలో జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇటీవల కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు, అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శనివారం విడుదలైన రాజకీయ విశ్లేషణల్లో, ఇటువంటి ఆరోపణలు ప్రజల్లో కూటమి పాలనపై సందేహాలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

May 30, 2026 / 03:03 PM IST

RTC టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు: మంత్రి

అన్నమయ్య: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. RTC ఆర్థికంగా బలంగా ఉందని,సంస్థకు రూ. 25-30 వేల కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. త్వరలోనే 2,500 ఈవీ, 500 CNG బస్సులు రానున్నాయని మంత్రి వెల్లడించారు.

May 30, 2026 / 03:02 PM IST

జిల్లాలో మరో ఐదు రోజులు భానుడి భగభగ

పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ సూచనల ప్రకారం జిల్లాలోని 15 మండలాలు హీట్ ఇండెక్స్ డేంజర్ కేటగిరీ (41°C నుంచి 54°C) పరిధిలో ఉండనున్నట్లు తెలిపారు.

May 30, 2026 / 03:02 PM IST

‘పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలి’

సత్యసాయి: జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కోరారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్వపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సి రివిజన్ (SIR-2026)లో భాగంగా జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు.

May 30, 2026 / 03:02 PM IST

జడ్పీ ఛైర్మన్‌తో చిత్తూరు జడ్పీ ఛైర్మన్ భేటీ

విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరస్పరం చర్చించుకున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరినొకరు శాలువాతో సత్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

May 30, 2026 / 03:01 PM IST

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సైలు బీ.రామ్‌కుమార్, వీ.త్రినాథ్‌రావు, ఏఆర్ హెచ్‌సీ ఎల్.గోవిందరావులకు శనివారం ఘన వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో సేవలందించిన వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహనరావు పాల్గొన్నారు.

May 30, 2026 / 03:01 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఫైర్

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘నన్ను ప్రశ్నించవచ్చు’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోగులు బంధువుల నుంచి ఎమ్మెల్యేకి సమస్యలు వెల్లువెత్తాయి. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని పిలుపునిచ్చారు.

May 30, 2026 / 03:00 PM IST

సక్సెస్ హై స్కూల్ ఎదురుగా PDSU ధర్నా

ATP: గుంతకల్లు పట్టణంలోని సక్సెస్ హై స్కూల్ ఎదురుగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ.. హైస్కూల్లో సరైన మౌలిక వసతులు లేవని, విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇలాంటి పాఠశాలలను సీజ్ చేయాలన్నారు.

May 30, 2026 / 03:00 PM IST

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా.. జాగ్రత్త ?

TPT: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పొగాకు రహిత సమాజ స్థాపనకై, పొగాకు నిర్మూలన కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు.

May 30, 2026 / 03:00 PM IST

సామర్లకోట ప్రమాదంలో మరొకరు మృతి

KKD: సామర్లకోట ఐదు తూముల వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన సింహాద్రి అనే మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇదే ప్రమాదంలో ఇప్పటికే ఉప్పాడకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

May 30, 2026 / 03:00 PM IST

“ఆపరేషన్ క్లీన్ స్వీప్”లో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీనీ స్వచ్ఛంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.

May 30, 2026 / 02:52 PM IST