• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో CMRF చెక్కులు పంపిణీ

GNTR: చేబ్రోలు మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. లబ్ధిదారలకు మొత్తం రూ.3,98,802లను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 01:54 PM IST

‘బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలి’

NDL: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం డిమాండ్ చేశారు. బనగానపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం మాట్లాడుతూ.. మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 01:45 PM IST

కస్తూర్బా విద్యాలయంలో ప్రవేశాల గడువు పొడిగింపు

KRNL: హలహర్వి KGBVలో ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులు ఈ అవకాశానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 4, 2026 / 01:44 PM IST

సీపీఐ జిల్లా నూతన కార్యదర్శి ఆర్. వెంకట్రావు

ప్రకాశం జిల్లా సీపీఐ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. వెంకట్రావును శనివారం ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి, ఎ. సురేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

April 4, 2026 / 01:41 PM IST

‘చేనేతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది’

KDP: చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు తెలిపారు. శనివారం మాధవరం-1 సచివాలయంలో చేనేతలకు ఉచిత విద్యుత్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు చమర్తి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లను కూటమి ప్రభుత్వం అందించడం హర్షనీయమన్నారు.

April 4, 2026 / 01:40 PM IST

చేబ్రోలులో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

GNTR: చేబ్రోలులోని బొమ్మలగుడి వద్ద శనివారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అక్కడి రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సీతారాముల పటాన్ని, అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

April 4, 2026 / 01:36 PM IST

‘టీటీడీ ఛైర్మన్‌పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు’

PLD: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా అమరావతి మండలం వైకుంఠపురంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 4, 2026 / 01:32 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలి: వైసీపీ

పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణులు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ ఐటీడీఏ పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 4, 2026 / 01:31 PM IST

విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ స్తంభాన్ని సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ సమయంలో ఈ రోడ్డు మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

April 4, 2026 / 01:30 PM IST

కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన కమిషనర్

NLR: నగర కమిషనర్ వై.ఓ నందన్ శనివారం నగరంలోని 37వ డివిజన్ క్రాంతి నగర్‌లో పర్యటించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హాల్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

April 4, 2026 / 01:30 PM IST

టీడీపీ నేతను పరామర్శించిన మంత్రి

ప్రకాశం: సింగరాయకొండ (మం) కలికివాయలో టీడీపీ సీనియర్ నాయకులు గాంధీ చౌదరిని మంత్రి డోలా శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కాలంలో అయినా అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. ఈ మేరకు గాంధీ ఆరోగ్య పరిస్థితుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మంత్రి డాక్టర్ కావడంతో కొన్ని సలహాలు సూచనలు చేశారు.

April 4, 2026 / 01:28 PM IST

తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల

KRNL: కోడుమూరు పట్టణం, పరిసర గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూ.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రజల్ జీవన్ మిషన్ పథకం కింద విడుదలైన ఈ నిధులతో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి కొరత తీరనుంది. శనివారం టీడీపీ పట్టణాధ్యక్షుడు గంగాధర్ నాయుడు, గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు.

April 4, 2026 / 01:25 PM IST

గుర్తుతెలియని వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య

KDP: ముద్దనూరు టౌన్ పరిధిలోని కొండాపురం వైపు వెళ్లే రైల్వే మార్గంలో 2వ బ్రిడ్జి సమీపంలో సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సీఐ నాగేష్ బాబు, SI మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు రెండు రోజుల క్రితం లుంగీతో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 4, 2026 / 01:25 PM IST

”సర్పంచులు, వార్డు మెంబర్ల కృషి ఎంతో గొప్పది’

NDL: బనగానపల్లె మండలంలో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వైసీపీ సర్పంచులు,వార్డు మెంబర్ల కృషి ఎంతో గొప్పదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొనియాడారు. శనివారం పట్టణంలో వైసీపీ కార్యాలయంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల అభినందనలు వేడుకలు నిర్వహించారు. వారిని సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

April 4, 2026 / 01:25 PM IST

జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని, గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DDRC) సమావేశంలో శనివారం మంత్రుల నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనుల గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

April 4, 2026 / 01:20 PM IST