• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెదపాడులో వైసీపీ శ్రేణులు నిరసన ప్రోగ్రాం

ELR: పెదపాడు మండలం కలపర్రులోనీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైసీపీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తూ, అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీటీడీ బోర్డు ఛైర్మెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

April 4, 2026 / 12:29 PM IST

టీటీడీ ఛైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: వైసీపీ

PPM: వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు 54 మంది ఛైర్మన్‌లుగా చేసినప్పటికీ, ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆమె పేర్కొన్నారు.

April 4, 2026 / 12:20 PM IST

జోగారావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి

SKLM: నరసన్నపేటలో జోగారావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను ఇవాళ మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి దంపతులు, వైసీనీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

April 4, 2026 / 12:12 PM IST

పోలీస్ వాహనాలను ప్రారంభించిన ఇన్‌ఛార్జ్ మంత్రి

ELR: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ కొరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 60 లక్షల విలువైన ఆరు వాహనాలను పోలీసు వ్యవస్థకు అంకితం చేశారు. వాటినీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

April 4, 2026 / 12:10 PM IST

ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

నంద్యాల జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ప్రాధాన్యం గల ఈ జిల్లాలో శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

April 4, 2026 / 12:10 PM IST

ఈనెల 8న డౌనూరు వారపు సంత వేలంపాట

ASR: కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతకు సంబంధించి ఈనెల 8న వేలంపాట నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ అభివృద్ధి అధికారిణి రేష్మ ఇవాళ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5వేల ధరావత్తు చెల్లించాలన్నారు. వేలంపాట కాలపరిమితి 2027 మార్చి 31వ తేదీవరకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి పంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తామన్నారు.

April 4, 2026 / 12:09 PM IST

ప్రోటోకాల్ హక్కుల పరిరక్షణ అవసరం

TPT: ప్రోటోకాల్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, దానిని ఎవరూ తస్కరించకూడదని, విస్మరించకూడదని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిర్ణయంతో ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను, పార్టీకి, కార్యకర్తలకు న్యాయం చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

April 4, 2026 / 12:09 PM IST

సూర్యప్రసాద్‌ను సత్కరించిన డ్వామా పీడీ

W.G: రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార గ్రహీత చిలుకూరి సూర్యప్రసాద్‌ను జిల్లా డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు అభినందించారు. యలమంచిలిలోని సూర్య ప్రసాద్ స్వగృహానికి శనివారం వెళ్ళిన పీడీ శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు.

April 4, 2026 / 12:08 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభం ఎప్పుడో.. ?

VZM: కొత్తవలస కూడలిలో అన్న క్యాంటీన్ పనులు పూర్తి అయిన ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఇక్కడ ప్రారంభానికి ఇంకా ఖరారు చేయకపోవడంతో పేదలు ఆకలితో ఎదురుచూస్తున్నారు. నాయకులు స్పందించి ప్రారంభానికి నడుం కట్టాలని కోరుతున్నారు.

April 4, 2026 / 12:05 PM IST

BR నాయుడుకి వ్యతిరేకంగా YCP శ్రేణులు నిరసన

CTR: టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడుని వెంటనే తొలగించాలని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప డిమాండ్ చేశారు. శనివారం పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. శ్రీవారి ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.

April 4, 2026 / 12:04 PM IST

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన టెక్కలి మహిళ

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన మార్పు సాయి సృజన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తాజాగా విడుదల అయిన ఫలితాల్లో ఈమె ఎంపికయ్యారు. టెక్కలిలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేసిన ఈమె విజయవాడలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో బీఎల్ చేశారు. ఈమె తండ్రి నారాయణమూర్తి ఆంగ్ల ఉపాధ్యాయులు కాగా, తల్లి గృహిణి.

April 4, 2026 / 12:00 PM IST

దేవరపల్లి ఎస్సైగా మనోహర్

EG: దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్‌గా మనోహర్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ నుంచి మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన ప్రస్తుతం గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. విధుల్లో నిబద్ధత కలిగి , క్లిష్టమైన కేసులను చేదించడంలో కీలకపాత్ర పోషించారు. దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యo గోపాలపురం బదిలీ అయ్యారు.

April 4, 2026 / 12:00 PM IST

కోర్టు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ATP: గుత్తిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు శనివారం స్థలాలను పరిశీలించారు. ప్రస్తుత కోర్టు, రెవెన్యూ కార్యాలయ ఆవరణలోని రెండు ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అధికారులు వెల్లడించారు. డీటీ నారాయణ, మున్సిపల్ శానిటరీ ఇన్స్‌ఫెక్టర్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

April 4, 2026 / 12:00 PM IST

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం: మాజీ మంత్రి

సత్యసాయి: CM చంద్రబాబుది రైతు సంక్షేమ ప్రభుత్వమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఓడీ చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును ఆయన ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ధాన్యం బకాయిలను పూర్తిగా చెల్లించామని పేర్కొన్నారు. అనంతరం గ్రామాల పరిశుభ్రత కోసం కేటాయించిన స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు.

April 4, 2026 / 12:00 PM IST

జిల్లా రైతాంగ దశాబ్దాల కల సాకారం

SKLM: జిల్లా రైతాంగ దశాబ్దాల కల నెర వేరుతోందని, నేరడి బ్యారేజి నిర్మాణానికి అడ్డంకి తొలగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా జిల్లాలో అదనంగా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 115 TMCల జలాలను 50:50 నిష్పత్తిలో వాడుకునే అవకాశం లభించింది పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.

April 4, 2026 / 11:54 AM IST