NLR: చేజర్ల మండలంలోని చిత్తలూరు, రెడ్డి గుంట వాగు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గాలిపాలెం నుంచి చేజర్లకు వెళుతున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు ముందు భాగం దెబ్బతినింది.
KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇవాళ ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్‌లో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
మన్యం: సికెడి (క్రానికల్ కిడ్నీ డిసీజ్)పై వైద్య సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఓ పత్రికలో వచ్చిన ‘ఏ తలుపు తట్టిన మృత్యు ఘోషే’ వార్తకు ఆయన పై విధంగా స్పందించారు. వార్త తెలిసిన వెంటనే జియ్యమ్మవలస ఆరోగ్య వైద్యాధికారిని విచారణ చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశించారు.
KRNL: ఆదోనిలో సెన్సెస్ స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రన్ సాగింది. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 150 మంది మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజల్లో స్వీయ గణనపై చైతన్యం పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
కృష్ణా: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కోటి పైన సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, టీడీపీకి కార్యకర్తలే బలమని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబు నాగేంద్రప్రసాద్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 170 అడుగుల ఎత్తైన గోపురంతో 16 ఎకరాల కొబ్బరి తోట మధ్యలో కొలువై ఉంది. దీనిని ‘కోనసీమ కోణార్క్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి వారు తన భార్యలతో పూజించబడతారు. ఈ ఆలయాన్ని సుమారు 100 ఏళ్ల క్రితం జమీందారులు నిర్మించారు. ప్రతి ఆదివారం విశేష పూజలు జరుగుతాయి.
E.G: ప్రతి వార్డును పార్టీ ప్రచార కేంద్రంగా మార్చాలని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సూచించారు. ఆదివారం 6వ వార్డు పర్యటనలో కార్యకర్తలతో సమావేశమై జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
కర్నూలులోని బిషప్ చర్చిలో ఫాదర్ బిషప్ గోరంట్ల జనాస్ను ఆదివారం TDP యువనేత గౌరు జనార్దన్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలను విస్తరించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
ప్రకాశం: పీసీపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి.నరసింహారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఎస్సై తెలిపారు. ప్రజల సమస్యలపై తక్షణ స్పందనతో సేవలందిస్తానని పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మేరకు పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరం లేకుండా కొనుగోలు చేయొద్దన్నారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి సవితని ఇటీవల నూతనంగా నియమితులైన సత్యసాయి జిల్లా కురుబ సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో కురుబ సంఘం బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి సవిత హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలు బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. మరోవైపు స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయని, అలా చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మార్కాపురం నూతన సీఐగా అల్తాఫ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవడం తన ప్రాధాన్యమని తెలిపారు. చట్టం, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తానన్నారు. పోలీస్-ప్రజల అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.
ATP: అనంతపురం నగరంలో జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మలోలాతో కలిసి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
CTR: నగరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.