KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
బాపట్లలో సచివాలయం తనిఖీలో డ్రెస్ కోడ్ పాటించని డిజిటల్ అసిస్టెంట్‌పై కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధులకు నైట్ దుస్తులతో హాజరైనందుకు సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 11 అర్జీలు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
W.G: కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు.
ATP: కాలవ ఫౌండేషన్ ఛైర్మన్ కాలవ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి భరత్‌తో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు చక్కని వేదికలని అభిప్రాయపడ్డారు. క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
గుంటూరు: రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి కష్టాలను జయించి ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితం సాధించింది. కూలీ పనులు చేసే తల్లిదండ్రుల పరిస్థితి ఆమెను మరింత పట్టుదలగా చదివేలా చేసింది. ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన నూతన ఫ్లడ్ లైట్లను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. హోమియో వైద్యశాల – నాగార్జున హాస్టల్ మార్గం, అర్థశాస్త్ర విభాగం–కలెక్టర్ బంగ్లా కూడలిలో ఇవి ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యార్థులకు ఇవి ఉపయుక్తంగా మారనున్నాయి.
E.G: ధవళేశ్వరం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్ల రాజబాబు (58) మృతి చెందాడు. వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సోదరుడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కడప: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్, మండల కో-ఆప్షన్ సభ్యులు బాలస్వామి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలో మంచి పేరు తెచ్చుకున్న మృదు స్వభావం కలిగిన బాలస్వామి మృతికి పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సంతాపం తెలిపారు. మండల ప్రజలు ఆయన సేవలను కొనియాడారు.
NDL: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. బేబి నియామకమయ్యారు. ప్రస్తుతం ఆదోని మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమెను ఇవాళ బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టులో తన సొంత వేతన శ్రేణిలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రకాశం: 132/33 కేవీ గిద్దలూరు సబ్ స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలం యడవల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు.
BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర నూర్ భాషా సంఘం ప్రధాన కార్యదర్శి, అద్దంకి పట్టణ 17వ వార్డు వైసీపీ యువ నేత కొటికలపూడి శ్రీను అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కృష్ణా: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్‌లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలం సజ్జాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గురువారం గుర్తుతెలియని మృతదేహం కలకలం లేపింది. మృతుడు మృతి చెంది చాలా రోజులు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో వివరాలు తెలియవలసి ఉందని, పోస్టుమార్టం కొరకు స్థానిక ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుపొందింది. ఇక్కడ స్వయంగా శ్రీరాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి 90.31 ఎకరాల భూములు ఉన్నాయి. భూముల నుంచి కౌలు రూపంలో రూ.5,47,800లు ఆదాయం వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.13,26,284ల ఆదాయం లభించినట్లు ఈవో శ్రీధర్ తెలిపారు.
గుంటూరు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ స్వయంగా తన వివరాలను నమోదు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు https://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా ప్రతి కుటుంబం తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.