VZM: ఒడిశా నుంచి విశాఖకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
CTR: జగ్జీవన్ రామ్ 119వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష శనివారం తెలిపారు. నగరంలోని గంగినేని చెరువు కట్ట వద్దగల జగ్జీవన్ రామ్ విగ్రహాం వద్ద నివాళులర్పించిన అనంతరం బీ. ఆర్. అంబేద్కర్ భవనము వరకు, చిత్ర పటములతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల అధికారులు హాజరుకావాలని కోరారు.
VSP: కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) సధారాణి రేలంగి ఈ నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆరో తేదీన ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. అనంతరం ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
TPT: మాయాపూర్ హరే రామ హరే కృష్ణ ఆలయ రెండవ పీఠాధిపతి జననీవాస్ మహరాజ్, తిరుపతి హరే రామ హరే కృష్ణ ఆలయ పీఠాధిపతి నీలా పారాయణ ప్రభు నాగలాపురం వేదనారాయణ స్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ ప్రాధాన్యంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
W.G: పెనుమంట్ర మండలం మాముడూరులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) మృతి చెందారు. సత్తెమ్మ తల్లి ఆలయ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద మట్టి పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్‌ను రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు.
NDL: నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత శనివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన చాకలి తిప్పన్నకు రూ.55,000, పందిపర్తి గ్రామానికి చెందిన ఉప్పర వసంత కుమారికి రూ.66,750 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు సహాయంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆదుకుంటామన్నారు.
E.G: ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న కడియం మండలం జేగురుపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శనివారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసరావు ఆద్వర్యంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, వార్డు సభ్యులను, ఎంపీటీసీలు నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, ఆకుల సుధాకర్‌లను ఘనంగా సత్కరించారు.
BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా పని చేయాలన్నారు.
NTR: నందిగామ మండలం ఐతవరం నేషనల్ హైవే 65పై శనివారం తెల్లవారుజామున వాల్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతుడు చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వోల్వా బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
అన్నమయ్య: చిట్వేలి ఆర్టీసీ బస్టాండ్ చెత్త, ముళ్లకంపలు, దుర్వాసనతో దారుణ స్థితికి చేరింది. వాష్‌రూమ్‌లు పనికిరాక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లతో నిర్మించిన ఈ సదుపాయం నిర్లక్ష్యానికి బలైందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి శుభ్రత, సౌకర్యాలు పునరుద్ధరించకపోతే ప్రజా ఆగ్రహం ఉధృతమయ్యే ప్రమాదం ఉందన్నారు.
కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమితులైన డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమీర్ మీర్జా భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ ఎంపీడీవో తెలిపారు. పలువురు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు.
VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దాని పేరుతో జరుగుతున్న దోపిడికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.
VZM: శ్రీ సాయి వాగ్దేవి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఊకల ఖ్యాతి, దామినిలకు జాతీయ రత్న ఉగాది పురస్కారాలు లభించాయి. విశాఖ పౌరగ్రంధాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సంస్థ అధ్యక్ష్యులు పివీ భాస్కరరావు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్నారు.
VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శబల భోజనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ పండుగలో కులాకార్ బియ్యం పంపిణీ చేశారు. చేతివృత్తులు, వెదురు ఇల్లు ఆకట్టుకోగా, ప్లాస్టిక్ రహిత ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. సహజ పదార్థాలతో తయారుచేసిన పానీయాలు, విత్తనాలు, ప్రకృతి ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.