• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గురుకుల ఫలితాల్లో హాలహర్వి విద్యార్థుల ప్రతిభ

KRNL: నందవరం మండలం హాలహర్వికి చెందిన విద్యార్థులు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రేమ్ కుమార్‌ను గ్రామస్థులు అభినందించారు. విద్యాభ్యాసంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 09:38 AM IST

వైఎస్ జగన్‌ను కలిసిన చింతాడ

SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ స్థితిగతులపై చర్చించారు. అలాగే, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.

April 10, 2026 / 09:36 AM IST

తిరుపతి రుయాకు వెళ్తున్నారా..?

TPT: తిరుపతి రుయాలో గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు. ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకుని సేవలు పొందవచ్చని వైద్యులు సూచించారు.

April 10, 2026 / 09:17 AM IST

నక్కపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు నియామకం

AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.

April 10, 2026 / 09:13 AM IST

నేటి నుంచి రాకపోకలు పునరుద్ధరణ

కోనసీమ: పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు వంతెనపై శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మూసివేసిన ఈ వంతెనకు సుమారు రూ.61 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. వంతెనపై సోలార్ దీపాలు, ట్రాఫిక్ సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

April 10, 2026 / 09:11 AM IST

రంగంపేట క్రాస్ వద్ద “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు

CTR: పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” అనే కార్యక్రమం పూతలపట్టు సీఐ గోపి నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రోత్సహిస్తూ వారి వివరాలను సేకరించారు. అలాగే హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ వారి వివరాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

April 10, 2026 / 09:03 AM IST

జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర

NTR: జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అధికారులతో కలిసి 123 ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సంవత్సరంలో ప్రమాదాల రేటు తగ్గిందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

April 10, 2026 / 09:02 AM IST

NSUI ఆవిర్భావ దినోత్సవం.. ఉచిత వైద్య శిబిరం

GNTR: NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు సంగడిగుంటలో ఇందిరా గాంధీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్ కరీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NSUI జెండాను ఆవిష్కరించారు. శిబిరంలో కంటి, గుండె, దంత, జనరల్ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

April 10, 2026 / 08:50 AM IST

పది రోజులపాటు ‘ప్రగతి పండుగ’: ఎమ్మెల్యే

ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినం రోజు ఏప్రిల్ 20 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో పది రోజులపాటు ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11 లోపు వెయ్యి మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు.

April 10, 2026 / 08:49 AM IST

‘అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పద్మశ్రీ అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. పీఎఫ్ విభాగంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

April 10, 2026 / 08:47 AM IST

గాజువాకలో ఇద్దరు యువకులు అరెస్టు

VSP: గాజువాకలోని మసీదు వద్ద ఇద్దరు యువకులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని గాజువాక క్రైమ్ ఎస్సై సీహెచ్ హరికృష్ణ గురువారం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన గండి బోయిన ఉదయ్ కిరణ్, తురక దుర్గారావు వద్ద నుంచి తనిఖీ చేసి బంగారం, 45 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

April 10, 2026 / 08:46 AM IST

‘ABN రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి’

కృష్ణా: ఏపీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నిన్న తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల గౌరవం కాపాడడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతని అన్నారు. రాధాకృష్ణ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 10, 2026 / 08:40 AM IST

బంగారం చోరీ కేసులో నిందితుడికి జరిమానా

VZM: 2022లో జామి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడికి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్సై వై.వి. జనార్ధన్ గురువారం తెలిపారు. అన్నంరాజుపేట గ్రామానికి చెందిన మంగమ్మ వద్దకు ఫ్లోర్ క్లీనింగ్ నెపంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాకెళ్లారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి తీర్పుని వెల్లడించింది.

April 10, 2026 / 08:39 AM IST

అక్రమంగా ఇసుక తవ్వకాలు.. వాహనాలు సీజు

శ్రీకాకుళం నగర పరిధిలోని నాగావళి నదిలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి. మోహనరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు నిర్వహించి, ఇసుక తరలిస్తున్న ఎక్స్కవేటర్, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. గత ఏడాది డిసెంబర్‌తో అనుమతులు ముగిశాయని స్థానికలు పేర్కొన్నారు.

April 10, 2026 / 08:32 AM IST

ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలి: మంత్రి

కృష్ణా: మచిలీపట్నం 8వ డివిజన్లో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే కాలంలో మచిలీపట్నం పోర్టు పూర్తై, యువతకు అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 10, 2026 / 08:27 AM IST