• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా

కర్నూలు: విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారన్నా రు.

April 10, 2026 / 10:14 PM IST

నూతన విమాన సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. అలాగే వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు.

April 10, 2026 / 10:00 PM IST

నూతన విమాన సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. అలాగే వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు.

April 10, 2026 / 10:00 PM IST

హత్యకేసు నిందితుడికి రిమాండ్: సీఐ

VZM: 2026 కొత్తవలస పోలీసు స్టేషనులో నమోదైన హత్యకేసు నిందితుడికి కొత్తవలస కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ షణ్ముఖరావు ఇవాళ తెలిపారు. సీఐ వివరాల మేరకు రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వి.సోమేశ్వరరావు జనార్ధననగర్‌లో తన స్నేహితుడైన కె.అశోక్ కుమార్‌ను రక్తం వచ్చినట్లు కొట్టడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు చెప్పారు.

April 10, 2026 / 09:56 PM IST

కొణిదేనలో రీసర్వేకు గ్రామ సభ

BPT: అద్దంకి మండలంలోని కొణిదేన గ్రామంలో రీసర్వే కార్యక్రమానికి సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రీసర్వే విధానం, చేపట్టే చర్యలపై అధికారులు వివరించారు. గ్రామంలో భూ రికార్డుల పునఃసర్వే ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. భూముల సరిహద్దులు, పట్టాదారుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేసే దిశగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

April 10, 2026 / 09:53 PM IST

‘వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

SKLM: ఎచ్చెర్లలలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశానికి ఇవాళ ఎంపీపీ చిరంజీవి అధ్యక్షత వహించారు. రానున్న వర్షాకాల సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది సంసిద్ధంగా ఉంటూ ప్రజలను వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్ నందు మందుల నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టీలు పరిశీలించారు.

April 10, 2026 / 09:49 PM IST

జాతీయ రహదారి 716 భూసేకరణ పనులపై జేసీ సమీక్ష

TPT: జాతీయ రహదారి 716 భూసేకరణ పనులను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కరకంబాడి ఇందిరానగర్ కాలనీ గ్రామస్తులు భూ పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేయగా, జేసీ సానుకూలంగా స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 09:48 PM IST

మాజీమంత్రికి ఆరు నెలల జైలు శిక్ష

VSP: మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. 2016 ఏప్రిల్ 17న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇది ఆత్మహత్యాయత్నమని అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఇవాళ తీర్పు వెలువడింది.

April 10, 2026 / 09:38 PM IST

‘గిరిజన గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలి’

పార్వతీపురం మండలంలో గల పనసభద్ర, తొక్కుడు వలస, కోరి గంగాపురం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజన గ్రామాలను సందర్శించారు. గ్రామంలో ఉన్న గిరిజనులతో గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నట్లు మహిళలు తెలిపారు. విద్యుత్ సౌకర్యం లేక, సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేక రోగాలు బారిన పడుతున్నట్లు తెలిపారు.

April 10, 2026 / 09:35 PM IST

సమస్యల పరిష్కారంలో మొదటి స్థానంలో నిలుపుతాం: MLA

కృష్ణా: గన్నవరం నియోజకవర్గాన్ని ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం అంబాపురంలో జరిగిన ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నామని, త్వరలోనే అగ్రస్థానానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

April 10, 2026 / 09:32 PM IST

మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని వినతి

NTR: అమరావతి సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం కలిశారు. తిరువూరులో బీసీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 10, 2026 / 09:32 PM IST

గిద్దలూరులో రేపు పవర్ కట్

ప్రకాశం: గిద్దలూరు 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా, గిద్దలూరు మండలంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈఈ శేషగిరిరావు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

April 10, 2026 / 09:30 PM IST

’హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలి‘

ASR: వివిధ వ్యాధులను నయంచేసే హోమియోపతి వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జీకేవీధి మండలం సీలేరు హోమియోపతి వైద్యాధికారి డా.సృజనారాయ్ సూచించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఇవాళ డా.శామ్యూల్ హానిమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు హోమియోపతి నయం చేస్తుందన్నారు.

April 10, 2026 / 09:27 PM IST

యువకుడు దారుణ హత్య.!

కడప: జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడులో శుక్రవారం బండి మహేశ్ బాబు (25) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మహేశ్, చరణ్ గొడవపడ్డారు. ఈ గొడవలో మహేశ్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజుపాలెం SI ప్రణయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

April 10, 2026 / 09:25 PM IST

పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

W.G: నరసాపురం మున్సిపల్ పన్ను చెల్లింపుదారులకు కమిషనర్ వెంకట రామిరెడ్డి తీపి కబురు అందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు ఒకేసారి చెల్లిస్తే 5% రిబేట్ లభిస్తుంది. అలాగే, గత ఏడాది బకాయిలపై 50% వడ్డీ మాఫీతో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వెసులు బాటును వినియోగించుకొని ప్రజలు గడువులోగా పన్నులు చెల్లించాలని కోరారు.

April 10, 2026 / 09:24 PM IST