PLD: పిడుగురాళ్లలో జరుగుతున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను తహశీల్దార్ జెట్టి మధుబాబు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH. శైలజ సందర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను తహశీల్దార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సుమారు 50 మంది సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలు, వాహనాల పత్రాలు పరిశీలించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
GNTR: తెనాలిలో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యటించారు. 14వ వార్డులో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న శానిటేషన్ పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో శానిటేషన్ పనులు ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ASR: జిల్లాలో భూగర్భ జలాలను పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ టీ.నిశాంతి ఆదేశించారు. చెక్ డ్యాంలు, ఫారం పాండ్స్ నిర్మాణాలకు మండలాల వారీగా మ్యాపులను తయారు చేయాలని సూచించారు. శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. దానికి అనుగుణంగా భూగర్భ జలాలను పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీ కార్యదర్శిగా ఐ.ప్రదీప్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చోడవరం నుంచి బదిలీపై ప్రదీప్ ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కే.నాగేశ్వరరావు రావికమతం మండలం బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీడీవో కొంకి అప్పారావును మర్యాదపూర్వకంగా కలిశారు.
NDL: జూపాడు బంగ్లా మండలం తర్తూరుకు చెందిన విద్యార్థి కోవిద్ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో ఆల్ ఇండియా 46వ ర్యాంకు సాధించినట్లు శుక్రవారం తండ్రి విశ్వనాథ రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా కోటాలో స్థానం దక్కినట్లు తెలిపారు. దీంతో గ్రామస్థులు, పలువురు విద్యార్థిని అభినందించారు.
E.G: సామాజిక మార్పు కోసం కృషి చేసిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని KVPS నాయకులు జువ్వల రాంబాబు పేర్కొన్నారు. శనివారం నిడదవోలులో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. కుల రహితం, సమాజ హితం, సమభావన లక్ష్యంతో ముందుకు వెళ్లడమే ఫూలేకు నిజమైన నివాళి అని అన్నారు.
CTR: ఎస్ఆర్ పురం మండలం యువకుడి ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన మధుబాబుపై అర్ధరాత్రి 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ఆరుగురి యువకులు దాడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
KDP: కమలాపురం క్రాస్ రోడ్ వద్ద తాడిపత్రి జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇవాళ నడిరోడ్డుపై పడుకుంటూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించాడు. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనను వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం సేవించి ప్రజా రహదారులపై అల్లరి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.
కోనసీమ: మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఓటు విలువ ఈరోజు అభివృద్ధిగా మీ ముందు ఉందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై రాకపోకలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఓఎన్జీసీ సీఎస్సార్ నిధులు రూ.61 లక్షలతో ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించారు. దీంతో పాటు వారధిపై సోలార్ లైట్లు బిగించారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌ను ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి తగిన పరిష్కారాలు చూపడం, వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేయడం తన బాధ్యతని పల్లవి పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్‌లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
W.G: ఆచంట మండలం కోడేరు ఉత్తర పాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 కార్లు, 7 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
GNTR: హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అధికారులు మూడు మార్గాలను పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్‌ఆర్, విజయవాడ బైపాస్, గుంటూరు మార్గాలపై అధ్యయనం కొనసాగుతోంది. మూడు మార్గాల సాధ్యాసాధ్యాలను అధికారులు సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. ఈ మార్గాలలో అనువైనదాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు సమాచారం.
ASR: జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతారని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అన్నారు. ముఖ్యంగా పిల్లలు, చిన్నారులను జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం కంఠారం సెక్టార్ పరిధిలోని బకులూరు, బాలారం అంగన్వాడీ కేంద్రాల్లో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు.
KRNL: ఏప్రిల్ 14న ఎమ్మిగనూరు MRO కార్యాలయం ఆవరణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సభ జరగనుంది. ఈ సందర్భంగా దళిత, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జయంతి కమిటీ నేతలు శుక్రవారం పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కమిటీ నేతలు తెలిపారు.