NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.
PLD: రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం తొలగింపులు జరిగితే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని చెప్పుకొచ్చారు.
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలం యర్రగుంట్ల గ్రామం అటవీ ప్రాంతంలో నాటు సారా బట్టీలపైన ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా గిద్దలూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరావు తెలిపారు. నాటు సారా తయారు చేయటం, విక్రయించటం నేరమని అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BPT: జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి వీ. నాగార్జున రావు శుక్రవారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. సంజయ్ గాంధీ కాలనీ, చంగల్ రాయుడు తోట సచివాలయ పరిధిలోని అరవపాలెం ఏరియాలో జరుగుతున్న ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు. నీటి నిల్వల్లో దోమల లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పట్టణ వాసులకు సూచించారు.
PPM: ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా న్యూస్ లెటర్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో చాట్ జీపీటీ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పక్కా బడ్జెట్ ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. సమాజంలో క్యాన్సర్ గురయ్యే మహిళల్లో 50% పైగా సెర్వికల్ క్యాన్సర్‌తో బాధ పెడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఉచితంగా వేలాది రూపాయలు ఖరీదు గల వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నారు.
CTR: ఆర్‌బీఐ సౌజన్యంతో చిత్తూరు విడ్స్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వెదురుకుప్పం మండలంలో వెలుగు సంఘ సభ్యులతో అవగాహన శిబిరం నిర్వహించింది. సివిల్ స్కోర్ నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రతతో పాటు ప్రధాన మంత్రి భీమా,పెన్షన్ పథకాలపై వివరించారు. తక్కువ ప్రీమియంతో సామాజిక భద్రత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ATP: జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ సూచించారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా తరగతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పనకు జనాభా లెక్కలు ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
KDP: పొరుమామిళ్ల విద్యుత్ శాఖ ఏడీఈగా బైరి రవి కుమార్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఈ మహేశ్, సిబ్బంది స్వాగతం పలికారు. పోరుమామిళ్ల, కాసినాయన, కలసపాడు మండలాలలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
KRNL: ఎమ్మిగనూరులోని R&B గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ప్రజల నుంచి రెవెన్యూ, పింఛన్లు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోనేగండ్లలో కార్యకర్తల సమావేశంలో MyTDP యాప్ వినియోగంపై చర్చించారు.
AKP: గంధం అమావాస్య పండగ సందర్భంగా ఎస్ రాయవరంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఇవాళ సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని సూచించారు. ఈ పోటీల్లో 30 టీమ్స్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు టోర్నమెంటు కొనసాగుతుందన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.
WG: నరసాపురం మండలం సరిపల్లి గ్రామ రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పాసు పుస్తకాలను అందజేశారు. భూ సమస్యల పరిష్కారం, రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సరిపల్లి రెవెన్యూ పరిధిలో మొత్తం 627 మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరయ్యాయని వివరించారు.
TPT: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ప్రక్రియతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సుమారు 16 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజును భరిస్తుండగా, 900 మంది పేదలకు ఉచితంగా భూమి అందజేస్తున్నారు.