• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విత్తన గోళీలతో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

VSP: పెందుర్తి మండలం సంకల్ప కళా గ్రామంలో శనివారం SOS భీమిలి విద్యార్థులతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం సమావేశమయ్యారు. డ్రోన్‌ల ద్వారా చల్లేందుకు 6 మి.మీ పరిమాణంలో విత్తన గోళీలు తయారు చేయించి, వాటిని కొండలు, తీర ప్రాంతాల్లో చల్లి శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలని సూచించారు.

May 30, 2026 / 05:30 PM IST

‘ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి’

AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ, పోలీసు, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వ సేవల వినియోగం, చట్టాలపై అవగాహన కల్పించారు. తమ హక్కులను తెలుసుకోవాలని అధికారులు అన్నారు.

May 30, 2026 / 05:30 PM IST

పిన్నదరి ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం

సత్యసాయి: తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ ఎస్సీ కాలనీలో వేసవి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధులతో ఇక్కడ కొత్త బోరు వేయించి, నూతన మోటార్ ఏర్పాటు చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

May 30, 2026 / 05:25 PM IST

ఆర్టీసీ బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి,మాధవరం-1 పార్వతీపురం వద్ద శనివారం కడప నుంచి తిరుపతికి వెళుతున్న కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది మరొక బస్సులో ఎక్కించి గమ్యానికి పంపించారు. బస్సులో ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

May 30, 2026 / 05:23 PM IST

‘ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలి’

VZM: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన జిందాల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనకు రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన శనివారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ఋలతో నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

May 30, 2026 / 05:20 PM IST

ఆత్మహత్య చేసుకున్న మృతుడి ఆచూకీ లభ్యం

ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి ఆచూకీ లభించింది. మృతుడు తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మంగలి ధనుంజయగా గుర్తించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

May 30, 2026 / 05:20 PM IST

పెండింగ్ కేసులు పరిష్కరించాలి

CTR: రొంపిచర్ల, పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్ స్టేషనులను SDPO వెంకటనారాయణ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు. మహిళల నేరాలు, సైబర్ నేరాలను అరికట్టడం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

May 30, 2026 / 05:17 PM IST

‘తవ్వకాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి’

KDP: పాములూరు గుట్టలో తాము అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన అనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు, రవాణా చేపడుతున్నామని లీజుదారులు వీరభద్రుడు, రమేశ్ తెలిపారు. శనివారం వేంపల్లె CI నర్సింహులును కలిసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు. అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.

May 30, 2026 / 05:15 PM IST

‘డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలి’

అన్నమయ్య: ములకలచెరువు మండలంలో చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని మండల DY.MPDO మోహన్ ప్రతాప్ పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని కదిరినాథునికోట, నాయునిచెరువుపల్లె పంచాయితీల్లోని చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్ నాయక్, విశ్వనాధ్ పాల్గొన్నారు.

May 30, 2026 / 05:14 PM IST

మారకద్రవ్యరహితంగా జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్

NTR: మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్ నాశనం కాకూడదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, CPఎస్‌వీ రాజశేఖర బాబు పిలుపునిచ్చారు. విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో మాదకద్రవ్యాల నియంత్రణ, హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

May 30, 2026 / 05:12 PM IST

ఆదోనిలో పాఠశాలపై డీఎస్ఎఫ్, పీడీఎస్‌వో ధర్నా

KRNL: ఆదోనిలో డీఎస్ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో శనివారం నారాయణ పాఠశాలపై ధర్నా నిర్వహించారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయులతో అడ్మిషన్ ప్రచారం చేయించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, ఒలింపియాడ్‌లు, టెక్నో కోర్సుల పేరుతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

May 30, 2026 / 05:09 PM IST

చీరాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

BPT: చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శనివారం ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం కారంచేడు రోడ్డు నుంచి సెయింట్ ఆన్స్ హై స్కూల్ వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

May 30, 2026 / 05:08 PM IST

కాళ్లకూరు శ్రీవారి ఆలయానికి భారీ విరాళం

W.G: కాళ్లకూరు శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం మాడవీధుల విస్తరణ కోసం భక్తులు ఉదారంగా స్పందించారు. కలవపూడికి చెందిన పెన్మెత్స దుర్గాప్రసాదరాజు- శ్రీదేవి, వేగేశ్ హేమంత్ సూర్యనారాయణరాజు -జ్యోతిర్మయి, దాట్ల కృష్ణరోహిత్ -చామంతికిరణ్మయి దంపతులు రూ. 2,11,116 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ స్వీకరించారు.

May 30, 2026 / 05:06 PM IST

ఓటర్ల జాబితా సవరణకు సిద్ధమైన యంత్రాంగం

పార్వతీపురం మన్యం జిల్లాలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్న BLOలకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్, తదితర అవసరమైన వస్తువులు అందజేశారు.

May 30, 2026 / 05:04 PM IST

నారాకోడూరులో రూ.1.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

GNTR: చేబ్రోలు (మం) నారాకోడూరు ఎన్‌టీఆర్ కాలనీలో మినీ బైపాస్ రోడ్డుకు ఏపీసీఆర్‌డీఏ మంజూరు చేసిన రూ.1.37 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పొన్నూరు ఎమ్మెల్యే, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. నారాకోడూరు గ్రామ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.

May 30, 2026 / 05:02 PM IST