• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జనగణనపై అవగాహనకు కలెక్టర్ ఆదేశాలు

GNTR: జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించాలని కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

April 21, 2026 / 06:44 AM IST

‘ఈనెల 26న ఆర్.కృష్ణయ్య నెల్లూరు రాక’

నెల్లూరు: బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈనెల 26న నెల్లూరు వస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి తెలిపారు. నెల్లూరులో మాట్లాడుతూ.. యాదవ భవన్లో ఈనెల 26న బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

April 21, 2026 / 06:19 AM IST

ఉపాధి హామీ అక్రమాలపై కలెక్టరుకు కేతిరెడ్డి ఫిర్యాదు

సత్యసాయి: ధర్మవరం YCP సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్ పనులలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టరుకు వివరించారు. క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 21, 2026 / 06:13 AM IST

భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

తూ.గో: సీతానగరం మండలం రఘుదేవపురంలో ఈ నెల 13న భార్య సుబ్బలక్ష్మిని హత్య చేసి, తాను కూడా చనిపోవడానికి యత్నించిన కోట నూకరాజును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు చనిపోయాక కోడలు, మనవళ్లను పోషించలేననే మనస్తాపంతో నూకరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. ఆసుపత్రిలో కోలుకున్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు కోరుకొండ CI మూర్తి తెలిపారు.

April 21, 2026 / 06:05 AM IST

నారాయణపురం-నాగిరెడ్డిపల్లి వంతెన ప్రారంభం

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి నారాయణపురం – నాగిరెడ్డిపల్లి వంతెనను ప్రారంభించారు. సుమారు రూ. 4.79 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల 15 గ్రామాల ప్రజల 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైంది. గతంలో వంతెన లేక ప్రజలు పది కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేదని ఎమ్మెల్యే తెలిపారు.

April 21, 2026 / 06:02 AM IST

విషాదం.. దిగుడుబావిలో పడి వ్యక్తి మృతి

కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

April 21, 2026 / 05:58 AM IST

గోస్పాడులో గోశాలను ప్రారంభించిన చాగంటి

NDL: ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోమవారం గోస్పాడులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గోశాలను ప్రారంభించారు. విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ పీ.దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి దంపతులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అద్భుతమని ఆయన కొనియాడారు.

April 20, 2026 / 10:08 PM IST

సెన్సస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

CTR: వేదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పురుషోత్తం, తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో 2027 జనాభా లెక్కల రెండో బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ప్రారంభమైంది. అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

April 20, 2026 / 10:00 PM IST

మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం

TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్యానర్‌ను ఆవిష్కరించారు. మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

April 20, 2026 / 10:00 PM IST

నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

ATP: ఆయా శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, జలధార, జనగణన తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎంఏవై అర్బన్ కింద 17,239 ఇళ్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.

April 20, 2026 / 10:00 PM IST

గాయపడిన కానిస్టేబుళ్లను పరామర్శించిన ఎస్పీ

కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళగిరి NRI ఆసుపత్రిలో వారికి చికిత్స అందగా, జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు వెళ్లి పరామర్శించారు. వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబాల మద్దతుతో కోలుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 20, 2026 / 09:47 PM IST

కనిగిరి నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పామూరు, నెల్లూరు మీదుగా తిరుపతికి ప్రతిరోజు సాయంత్రం 06.00 గంటలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఈ బస్సు సాయంత్రం 6 కనిగిరిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరికి చేరుకుంటుందన్నారు.

April 20, 2026 / 09:46 PM IST

రేపు సంతమాగులూరుకు మంత్రి గొట్టిపాటి

BPT: సంతమాగులూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొప్పరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం 10:30 గంటలకు కొమ్మాలపాడులో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.

April 20, 2026 / 09:38 PM IST

రైతులకు కోసిగి ఏవో కీలక సూచన

KRNL: కోసిగి మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ కార్యాలయంలో సోమవారం రైతులకు కీలక సూచనలు చేశారు. విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం ముగిసే వరకు బిల్లులను భద్రపరుచుకోవడం వల్ల మొలక సమస్యలు లేదా పంట ఎదుగుదల లోపాలు తలెత్తినప్పుడు చర్యలు ఉంటాయన్నారు.

April 20, 2026 / 09:35 PM IST

మహిళ కంట్లో కారం కొట్టి గొలుసు దొంగతనం

GNTR: తెనాలిలో మహిళ కంట్లో కారం కొట్టి ఇద్దరు మహిళలు గొలుసు అపహరించారు. పట్టణ నాజరుపేటకు చెందిన భూలక్ష్మి టైలరింగ్‌ పని చేస్తుంది. నాజరుపేటకే చెందిన మంజుల, శ్రీలత ఆమె వద్దకు వెళ్లి తమకు జాకెట్లు కుట్టాలని మాట్లాడుతూ.. భూలక్ష్మి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.

April 20, 2026 / 09:35 PM IST