• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆటో డ్రైవర్ భార్య

KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.

April 17, 2026 / 06:22 AM IST

డ్రెస్ కోడ్ ఉల్లంఘనపై చర్య.. ఉద్యోగి సస్పెండ్

బాపట్లలో సచివాలయం తనిఖీలో డ్రెస్ కోడ్ పాటించని డిజిటల్ అసిస్టెంట్‌పై కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధులకు నైట్ దుస్తులతో హాజరైనందుకు సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 11 అర్జీలు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, పనితీరును మెరుగుపరచాలని సూచించారు.

April 17, 2026 / 06:20 AM IST

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్

W.G: కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు.

April 17, 2026 / 06:20 AM IST

మాజీ సర్పంచ్ బాలస్వామి కన్నుమూత

కడప: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్, మండల కో-ఆప్షన్ సభ్యులు బాలస్వామి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలో మంచి పేరు తెచ్చుకున్న మృదు స్వభావం కలిగిన బాలస్వామి మృతికి పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సంతాపం తెలిపారు. మండల ప్రజలు ఆయన సేవలను కొనియాడారు.

April 17, 2026 / 06:05 AM IST

ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. బేబి

NDL: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. బేబి నియామకమయ్యారు. ప్రస్తుతం ఆదోని మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమెను ఇవాళ బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టులో తన సొంత వేతన శ్రేణిలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 16, 2026 / 10:07 PM IST

ఆ మూడు మండలాల్లో రేపు పవర్ కట్

ప్రకాశం: 132/33 కేవీ గిద్దలూరు సబ్ స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలం యడవల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు.

April 16, 2026 / 09:47 PM IST

మృతి పట్ల అశోక్ కుమార్ దిగ్భ్రాంతి

BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర నూర్ భాషా సంఘం ప్రధాన కార్యదర్శి, అద్దంకి పట్టణ 17వ వార్డు వైసీపీ యువ నేత కొటికలపూడి శ్రీను అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

April 16, 2026 / 09:41 PM IST

ప్రారంభమైన జనగణన.. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్

కృష్ణా: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్‌లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

April 16, 2026 / 09:39 PM IST

గుర్తుతెలియని మృతదేహం కలకలం

ప్రకాశం: సంతమాగులూరు మండలం సజ్జాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గురువారం గుర్తుతెలియని మృతదేహం కలకలం లేపింది. మృతుడు మృతి చెంది చాలా రోజులు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో వివరాలు తెలియవలసి ఉందని, పోస్టుమార్టం కొరకు స్థానిక ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 16, 2026 / 09:33 PM IST

ముక్తి రామలింగేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే..?

KDP: ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుపొందింది. ఇక్కడ స్వయంగా శ్రీరాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి 90.31 ఎకరాల భూములు ఉన్నాయి. భూముల నుంచి కౌలు రూపంలో రూ.5,47,800లు ఆదాయం వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.13,26,284ల ఆదాయం లభించినట్లు ఈవో శ్రీధర్ తెలిపారు.

April 16, 2026 / 09:31 PM IST

స్వీయ గణన ప్రారంభం.!

గుంటూరు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ స్వయంగా తన వివరాలను నమోదు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు https://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా ప్రతి కుటుంబం తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

April 16, 2026 / 09:28 PM IST

జలధారతో చెరువులకు నీటి సరఫరా

TPT: జలధార కార్యక్రమం ద్వారా చెరువులకు తక్కువ ఖర్చుతో శాస్త్రీయంగా నీటి సరఫరా కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఎర్రావారిపాలెం మండలంలో పనులను పరిశీలించిన ఆయన, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణతో భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. సుస్థిర నీటి నిర్వహణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

April 16, 2026 / 09:22 PM IST

‘నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలి’

ASR: బొర్రా గుహల అభివృద్ధి కోసం ‘స్వదేశీ దర్శిని 2.0’ పథకం కింద మంజూరైన రూ.29కోట్ల 87లక్షల నిధులతో చేపట్టే పనులను అత్యంత త్వరతగతిన, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతగిరి మండలంలోని బొర్రా గుహల అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులన్నీ పక్కా ప్రణాళికతో, సిస్టమేటిగ్గా జరగాలని ఆదేశించారు.

April 16, 2026 / 09:19 PM IST

డ్రోన్ నిఘా.. మద్యం సేవిస్తే చర్యలు

CTR: ఎస్ఆర్ పురం మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమన్ హెచ్చరించారు. అక్రమాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి వినియోగం, అనుమానితుల సమాచారాన్ని 9440900692 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

April 16, 2026 / 09:16 PM IST

YCP పాలనలో మహిళలను వేధించారు: ఎంపీ

NDL: వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళలను వేధించారని ఇవాళ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. వైసీపీ కేడర్ వ్యక్తిత్వహననం, బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. సీఎం సతీమణి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురును కూడా కామెంట్ చేశారని మండిపడ్డారు. ఏపీ హోంమంత్రి అనితను అసభ్యంగా దూషించారని దుయ్యబట్టారు.

April 16, 2026 / 09:07 PM IST