కోనసీమ: కె .గంగవరం (M) కోటిపల్లికి చెందిన నవ వధువు ఓలేటి వీరలక్ష్మి (19) సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. ఫిబ్రవరి 26న పెళ్లి అయిన వీరలక్ష్మి పేరెంట్స్ ఇంటి వద్ద ఉరేసుకుని తనువు చాలించారు. తన కూతురు మృతికి అత్తింటి వారే కారణమని మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలోని ఏసుబాబును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
TPT: నాగలాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా టీజే ప్రణీత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సత్తివేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆశీస్సులతో అధ్యక్ష పదవి వచ్చిందని, ఇందుకు సహకరించిన పార్టీ నాయకులకు ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
NTR: నందిగామలో డయేరియా భయం నెలకొంది. పలు ప్రాంతాల్లో విరేచనాల కేసులు నమోదవుతున్నాయి. మున్సిపల్ వాటర్ పైప్‌లైన్‌లో మురుగునీరు కలవడంతో తాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని వార్డుల్లో నాలుగు రోజులుగా నీటి రంగు మారి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన హిందూ పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యా పర్యటనలో భాగంగా నగరవనం పార్క్, కొండవీడు కోటలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ.. నగరవనం పార్క్‌లోని పచ్చదనాన్ని, వన్యప్రాణులను దగ్గరగా చూసి ఆనందించారు. అనంతరం కొండవీడు కోటకు వెళ్లి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు.
SKLM: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో సర్వే చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు.
PLD: రీసర్వే జరిగిన మూసాపురం, పాటిబండ్ల గ్రామాలలో శనివారం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ‘రెవెన్యూ మేళా’ నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ధనలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించి, రైతులతో చర్చించి, సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AKP: ప్రాజెక్ట్-17A కింద నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ శుక్రవారం నౌకాదళంలో చేరింది. శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే టెక్నాలజీతో రూపొందిన ఈ నౌకలో బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు ఉన్నాయి. 75%కు పైగా స్వదేశీ భాగాలతో దీనిని ముంబైలో నిర్మించారు. అధునాతన రాడార్, సోనార్ సిస్టమ్‌లతో శత్రు కదలికలను ముందే గుర్తించగలదు.
VZM: రామతీర్థం గ్రామంలో మురుగు సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన వీధిలో చేపట్టిన రహదారి పనుల కారణంగా కాలువల్లో మట్టి చేరి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల పెరుగుదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
NDL: డోన్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో తేనెటీగల సమస్యపై శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో తేనెటీగల తట్టును గుర్తించి ప్రత్యేక పద్ధతులతో జాగ్రత్తగా తొలగించారు. ఈ సమయంలో విద్యార్థులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
CTR: పెద్దపంజాణి మండలం ఆరంజ్ జోన్లోకి వెళ్లింది. జిల్లాలో అత్యధికంగా ఆ మండలంలో శుక్రవారం 41.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 40.8, నగరిలో 40.1, శ్రీరంగరాజపురంలో 39.8, తవణంపల్లెలో 39.6, బంగారుపాళ్యంలో 39.0, పలమనేరులో 38.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాలలో 38.7, గంగవరంలో 38.6 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
KDP: దువ్వూరు మండల పరిధిలోని కడప – కర్నూలు జాతీయ రహదారిలో పెద్ద జొన్నవరం మెట్ట సమీపం నందు శుక్రవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయాలు పాలైన వారిని స్థానికులు 108 వాహనం సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేపట్టారు.
ELR: ఉభయ సభల్లో అమరావతి రాజధానికి ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆగిరిపల్లి మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అలాగే ‘మన రాజధాని మన అమరావతి’ అంటూ జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గ తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు పవర్ కాలువ ద్వారా గుండ్లకెరె చెరువుకు చేరి LLCకి మళ్లిస్తున్నారు. మూడు రోజుల్లో 250 కి.మీ పరిధికి చేరనుంది. విడుదల 15 రోజులు కొనసాగి ఈ నెల 18 లేదా 20వ తేదీకి నిలిపివేయాలని అధికారులు పేర్కొన్నారు.
TPT: దొరవారిసత్రం మండలంలో నెలబల్లిలో హజ్రత్ హుసేనమ్మ దర్గలో 56వ గంధ మహోత్సవం ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనుందని దర్గా కమిటీ వెల్లడించింది. 23న (గురువారం) రాత్రి గంధ మహోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, 24న(శుక్రవారం)రాత్రి పాటకచేరి, 25న(శనివారం) రాత్రి జబర్దస్త్ టీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారని వారు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని 42 PHCలలో పులిచెర్ల PHC మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో A గ్రేడ్ ఏదీ లేకపోగా, కేవలం 3 PHCలు మాత్రమే B గ్రేడ్ సాధించాయి. 23 PHCలు C, 15 D, ఒకటి E గ్రేడ్ పొందాయి. ఫిబ్రవరిలో పులిచెర్లలో 2693 OP, 41 IP, 3376 ల్యాబ్ పరీక్షలు జరగగా, చివరి స్థానంలోని ఆరుమాకులపల్లిలో 504 OP, 132 పరీక్షలు మాత్రమే నమోదయ్యాయి.