• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అంబేద్కర్ విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించి నివాళులర్పించారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ మంత్రి పదవినే త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని అసెంబ్లీలో కోరతానన్నారు.

April 14, 2026 / 02:52 PM IST

జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ELR: జీలుగుమిల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని చెప్పుకొచ్చారు.

April 14, 2026 / 02:51 PM IST

తెనాలి తహసీల్దార్‌కు బిరుదు ప్రధానం..!

GNTR: తెనాలిలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఐతానగర్‌లో బీఎస్‌ఏ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్‌ను సదరు యూత్ “మనసున్న మండల తహసీల్దార్” బిరుదులతో ఘనంగా సత్కరించారు.

April 14, 2026 / 02:49 PM IST

అగ్నిమాపక వారోత్సవాలలో రక్తదానం

W.G: తణుకు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తణుకు ఇంఛార్జ్ ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు.

April 14, 2026 / 02:45 PM IST

సచివాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

NLR: జలదంకిలోని చోడవరం సచివాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, కార్యదర్శి నాగరాజు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఆయన అనగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. పేదల పట్ల పెన్నిధిగా ప్రతి ఒక్కరి ఆశయాలు, హక్కులను కాపాడేలా రాజ్యంగాన్ని నిర్మించిన మహనీయుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

April 14, 2026 / 02:45 PM IST

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం మండలంలో మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కకర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 02:44 PM IST

పేదలకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే

ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA దగ్గుపాటి ప్రసాద్ అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

April 14, 2026 / 02:40 PM IST

‘మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు’

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను కలెక్టర్ ఎం.విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫైర్ ఎక్యూప్‌మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్.రామకృష్ణ పాల్గొన్నారు.

April 14, 2026 / 02:32 PM IST

ప్రభుత్వం రాజ్యాంగ విలువలను విస్మరించింది

KRNL: ఆలూరు నియోజకవర్గంలో డా.BR అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. MLA విరుపాక్షి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను విస్మరించి పాలన సాగిస్తోందని, మహిళల భద్రత తగ్గిందని విమర్శించారు.

April 14, 2026 / 02:31 PM IST

ప్రారంభమైన తాతయ్యగుంట గంగమ్మ జాతర

TPT: తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే నెలలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర ముందు మూడు వారాలు, జాతర అనంతరం ఐదు వారాలు మారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలి వారం ప్రారంభం కావడంతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

April 14, 2026 / 02:30 PM IST

ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించిన వ్యవసాయాధికారి

NTR: విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో పొలాల్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎంచుకుని ఆ టైమ్‌కి అక్కడికి వెళ్లి ధాన్యం అమ్ముకోవచ్చు అన్నారు.

April 14, 2026 / 02:30 PM IST

ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నారు

KDP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఖాజీపేట మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుంపలగట్టు మరియన్న పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నారని హిందూ, క్రిస్టియన్స్. ముస్లిం అంటూ, మతాల కుంపట్లు పెడుతున్నారని వారు దుయ్యబట్టారు.

April 14, 2026 / 02:30 PM IST

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎస్పీ

CTR: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శమని పేర్కొన్నారు.

April 14, 2026 / 02:28 PM IST

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PPM: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని, ఏ అనారోగ్య సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే, ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 14, 2026 / 02:26 PM IST

ఢిల్లీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 02:23 PM IST