KDP: బద్వేలు పురపాలికలోని నెల్లూరు రోడ్డులో రాచ పూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్లు కళాశాల ఏవో సాయికృష్ణ తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య శస్త్ర చికిత్సలు నిర్వహణ, మందులు, అద్దాల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.190, స్కిన్ లెస్ రూ.210, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.220 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.220 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీ పై రూ. 20 నుంచి 30 ధరలు తగ్గాయన్నారు.
KKD: మండిపోతున్న ఎండలవేళ ప్రజలకు ఊరటనిచ్చేందుకు నగరంలోని 16 ప్రధాన కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇవాల్టి నుంచి అన్ని చలివేంద్రాలు పని చేస్తాయన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవాళ ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కమిషనర్ నేరుగా అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. ప్రజలు 9515133115, 8639060229 నెంబర్లకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు, సూచనలు తెలపవచ్చని పేర్కొన్నారు.
E.G: సీతానగరం మండలంలో జనగణన (Census) తొలి విడత శిక్షణ కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది. తహసీల్దార్ (ఎంఆర్డీ) శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గణన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నమోదు ప్రక్రియపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
AKP: జింక్ ఫుడ్ తీసుకుంటే అనారోగ్యానికి గురవుతారని ఎలమంచిలి ఐసీడీఎస్ సీడీపీఓ ఇంద్రాదేవి అన్నారు. మునగపాక అంగన్వాడి కేంద్రాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఆకుకూరలతో తయారుచేసిన ఆహారం, వివిధ రకాల పండ్లు పిల్లలకు ఇవ్వాలన్నారు. ఆటపాటలతో పిల్లలకు విద్యాబోధన చేయాలన్నారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఆట బొమ్మలు తయారు చేయాలన్నారు.
కడప జిల్లాలో ఇవాళ చికెన్, మటన్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.213, స్కిన్లెస్ చికెన్ రూ.243, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్జ, హిర మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.
ASR: చింతపల్లి మండలం పెంటపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.కేడిపేట పాతూరు నుంచి చింతపల్లి వస్తున్న కారు ఆదివారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో పెంటపాడు వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న పృథ్వీ, శివ, జస్వంత్, ప్రవీణ్ గాయాల పాలయ్యారు. గాయాలపాలైన వారిని 108లో చింతపల్లి హాస్పిటల్‌కి తరలించారు.
ELR: అంబేద్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మండలంలోని సీతానగరం గ్రామంలో అంబేద్కర్ కమిటీ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతి విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపులు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
VSP: సండే వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే. విశాఖలో చికెన్, మటన్‌తో పాటు చేపల కోసం జనం మార్కెట్లు, ఫిషింగ్ హార్బర్ వద్ద క్యూ కడుతుంటారు. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల్లో ఇవాళ కేజీ మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్లెస్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ రూ.155, సొంట్యాం కోడి రూ.300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
W.G: ఏపీ మహిళా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం తణుకులో ఎన్నుకున్నారు. తణుకు NGO సంఘ భవనంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి అమరావతి ఛైర్పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులుగా కాట్రగడ్డ సుభాషిణి, కార్యదర్శి పిడకల సునీత, కోశాధికారి కోట చంద్రకుమారి, ఉపాధ్యక్షులుగా ఎం.షర్లీ, టి.అనంత ఎన్నికయ్యారు.
పల్నాడు: కారంపూడి మండలం కాకాని వారి పాలెంలో టీడీపీ నాయకుడు జాస్తి గంగారావు కుమారుడి వివాహం జరిగింది. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు మణికంఠ సాయి, గగన రత్నలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత, సాంకేతిక కారణాలను తెలుసుకోవడానికి కంపెనీ సాంకేతిక బృందం ఆదివారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.
VZM: భోగాపురం ఏపీ మోడల్ హై స్కూల్లో నేడు 6వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.పార్వతి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఉదయం 9 గంటలకే పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు.