W.G: మండల కేంద్రమైన కాళ్ల మేజర్ పంచాయతీలో మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీని ఏర్పాటు చేసేందుకు దాత సంధ్యా మెరీన్ సహకారం అందించినట్టు తెలిపారు. స్వచ్చమైన త్రాగు నీరు ప్రతీ గ్రామానికి అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం పీసీ కేశవరావు అధ్యక్షతన సీపీఎం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలు పోరాటాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి శిక్షణ ఇవ్వడం జరిగింది. సోషలిస్ట్ దేశాలు ఆదర్శ పాలన సాగిస్తున్నాయన్నాయి, మనదేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పాలన సాగుతుందన్నారు.
AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో జరుగుతున్న ఎర్ర చెరువు పనులను డూమా పీడీ నిర్మలదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ ఆధారిత హాజరులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి 10 గంటలకు ముగించాలన్నారు. అలాగే, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
KRNL: చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించరని ఇవాళ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ‘MAVIGUN’తో కేవలం రూ.10-20వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
PPM: సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. SEWA (షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PLD: అమరావతి మండలం ధరణికోటలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీతో లబ్దిదాదులు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతంరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
NTR: రామచంద్రాపురం సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో భవాని గ్రామ సభ సమావేశం నిర్వహించి, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను చర్చించారు. వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలు చేశారు.
ELR: విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీవరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని వీఆర్‌కు పంపిన ఎస్పీ, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ బ్రహ్మరాజు, సర్పంచ్ విక్టర్ బాబు, బోయపాటి పెద్దబుజ్జి, నీకెళ్లి గణేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ఆయన కన్న కలలను సాకారం చేయాలని బ్రహ్మరాజు పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ సేవలను స్మరిస్తూ పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.
TPT: జిల్లాలో ఇంటర్ తరగతులు ప్రారంభమై 15 రోజులు గడిచినా పుస్తకాలు అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు స్పందించారు. నూతన సిలబస్ పుస్తకాలను RIO కార్యాలయానికి చేరవేశారు. బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు RIO రాజశేఖర్ తెలిపారు. త్వరలోనే అందరికీ పుస్తకాలు అందుతాయని ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి మండలంలో శంఖవరంకు చెందిన తమ్మిశెట్టి పద్మ మంగళవారం ఎలుకలు మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కాగా తనకు పిల్లలు లేరని, అనారోగ్య కారణాలు ఉన్నాయని మానసికంగా కుంగిపోయి, మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
W.G: భీమవరం, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి డీఎస్పీ రఘువీర్ విష్ణు పుష్పమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయవాది, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యాలయంలో డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
GNTR: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.