PLD: నరసరావుపేట పట్టణం 30వ వార్డు ఆర్యవైశ్యుల TDP సీనియర్ కార్యకర్త ఆతుకూరి రామకృష్ణను 30వ వార్డు ఇంఛార్జ్ యూనిస్, 29వ వార్డు సెక్రటరీ బచ్చే మస్తాన్, 29వ వార్డు వైస్ ప్రెసిడెంట్ ముజీర్ పరామర్శించారు. కోట సెంటర్లోని లిఖిత హాస్పిటల్లో ప్రమాదవశాత్తు పడి కుడి బుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు.
సీతానగరం సువర్ణముఖి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంగళవారం చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు స్వామి వారి కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ స్వామి వారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారన్నారు.
AKP: నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం 8వ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలకు సెల్ పోన్లు ఇవ్వడం ద్వారా కంటి చూపు సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. బయట దొరికే ఆహారం కాకుండా ఇంట్లోనే దొరికే పౌష్టికాహారంను తయారు చేసి పెట్టాలన్నారు.
GNTR: యుద్ధ వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచుతున్నారనే విమర్శలు నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు ధరల భారంతో ప్రజలు నలిగిపోతున్నారు. ఇడ్లీలు నుంచి కూరగాయలు, గ్యాస్ వరకు 5-15% పెరుగుదల ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం జడ్పీ హైస్కూల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 72 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల కోరిక మేరకు వెంటనే డైనింగ్ హాలును మంజూరు చేసిన మంత్రి.. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే మంత్రి లోకేష్ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
VZM: గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనికి వెళ్లిన కన్నయ్య (65) అనే వ్యక్తి మంగళవారం పని చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి కూలీలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఎంపీడీవో రమణమూర్తి తెలిపారు. పని స్థలంలోనే మరణించినందున ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా సిఫార్సు చేశామని పేర్కొన్నారు.
W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు ‘డ్రై ఐ సిండ్రోమ్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ.. కళ్లలో మంట, దురద, ఎరుపు ఎక్కడం, దృష్టి మసకబారడం వంటివి వ్యాధి లక్షణాలని, వీటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువతకు కంటి సమస్యలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు.
KDP: ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపు, బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NDL: రుద్రవరం మండల కేంద్రంలో ఇవాళ పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలు మేళతాళాలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి రాజకీయ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
ELR: ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పై అధికారికంగా సోమవారం నుంచి రాకపోకలు అనుమతించిన సంగతి తెలిసిందే. కొన్ని భద్రత ప్రమాణాల నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేపై ద్విచక్ర వాహనాలు, ప్రయాణికుల ఆటోలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
CTR: ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిపాల మండలం బొమ్మసముద్రం జూనియర్ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అభినందించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్‌కు ధీటుగా మొదటి ఏడాది 94 శాతం, 2వ ఏడాది విద్యార్థులు 96 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యార్థులను, అధ్యాపకులను అభినందించి సన్మానించారు.
పల్నాడు: జిల్లా జంగమహేశ్వరపురంలో మంగళవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పత్రాల్లేని 23 బైక్‌లు, 4 ఆటోలు, కొన్ని ఆయుధాలను సీజ్ చేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ తనిఖీలు చేశారు. గ్రామాల్లో ఎవరైనా గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
NTR: గంపలగూడెం(M) మేడూరు ఆంజనేయస్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొవాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని సమన్వయకర్త శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు వెంకట కృష్ణారావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళా నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: పెనుకొండలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఆడపిల్లలకు POCSO Act పై అవగాహన ఉండాలని సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి తెలుసుకుని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించిన వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు.
E.G: కొవ్వూరు మండలం ఐ.పంగిడిలోని రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం అధికారులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.