• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి వార్డు పార్టీ ప్రచార కేంద్రంగా మార్చాలి’

E.G: ప్రతి వార్డును పార్టీ ప్రచార కేంద్రంగా మార్చాలని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సూచించారు. ఆదివారం 6వ వార్డు పర్యటనలో కార్యకర్తలతో సమావేశమై జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

April 26, 2026 / 12:35 PM IST

పీసీపల్లి నూతన ఎస్సైగా నరసింహారావు

ప్రకాశం: పీసీపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి.నరసింహారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఎస్సై తెలిపారు. ప్రజల సమస్యలపై తక్షణ స్పందనతో సేవలందిస్తానని పేర్కొన్నారు.

April 26, 2026 / 12:25 PM IST

‘ఇంధనంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు’

మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మేరకు పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరం లేకుండా కొనుగోలు చేయొద్దన్నారు.

April 26, 2026 / 12:24 PM IST

బంకుల్లో నో స్టాక్.. బండ్లు స్టాప్

KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలు బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. మరోవైపు స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయని, అలా చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

April 26, 2026 / 12:15 PM IST

మార్కాపురం సీఐగా బాధ్యతలు చేపట్టిన అల్తాఫ్

మార్కాపురం నూతన సీఐగా అల్తాఫ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవడం తన ప్రాధాన్యమని తెలిపారు. చట్టం, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తానన్నారు. పోలీస్-ప్రజల అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.

April 26, 2026 / 12:13 PM IST

సెన్సస్ 5K రన్ లో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్

ATP: అనంతపురం నగరంలో జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మలోలాతో కలిసి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

April 26, 2026 / 12:12 PM IST

ఘనంగా వాసవి అమ్మవారి జయంతి వేడుకలు

CTR: నగరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

April 26, 2026 / 12:09 PM IST

ప్రభుత్వ ఖాజీగా అక్రమ్ భాష నియామకం

సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఖాజీగా హఫీజ్ అక్రమ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో MLA కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కందికుంటకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అక్రమ్ భాష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

April 26, 2026 / 12:00 PM IST

కొండేపి నూతన సీఐగా రమణయ్య బాధ్యతలు

ప్రకాశం: కొండపి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వైవి రమణయ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలక్కుండా చూస్తామన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు పేకాటపై దృష్టి సారిస్తామన్నారు. సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 26, 2026 / 11:59 AM IST

‘తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి’

ELR: చింతలపూడి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సైతం తమకు సహకరించాలని స్థానిక కమిషనర్ అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని సూచించారు. అలాగే తమ పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీని ద్వారా రోగాలు దరిచేరవని వివరించారు.

April 26, 2026 / 11:56 AM IST

ఉంగుటూరులో వాసవి మాత జయంతి వేడుకలు

ELR: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఆదివారం ఉంగుటూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించి పలు ఆలయాలలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త పుల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

April 26, 2026 / 11:50 AM IST

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన గౌరు జనార్దన్

NDL: గడివేముల మండల కేంద్రంలో దేశం సత్యం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాణ్యం యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొన్నాయి.

April 26, 2026 / 11:47 AM IST

‘ప్రజలందరు జనగణన సర్వే ప్రక్రియకు సహకరించాలి’

KRNL: జిల్లా ప్రజలందరూ జనగణన సర్వే ప్రక్రియకు సహకరించి, నమోదు చేసుకోవాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. ఇవాళ ఎంపీ కార్యాలయంలో జనగణన స్వీయ ఎన్యుమరేషన్ భాగంగా ఇటివల స్వీయ గణన చేసుకున్న ఎంపీ నాగరాజుకు జనగణన సహాయాధికారి శివన్న మెమెంటో అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం స్వీయ గణనలో పాల్గొని సరైన వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

April 26, 2026 / 11:40 AM IST

చిన్న అన్నవరంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

ELR: లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటిరోజు స్వామి అమ్మవార్లను ఆలయ వేద పండితులు స్వామివారిని పెళ్ళి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు.

April 26, 2026 / 11:34 AM IST

అంబేద్కర్ విగ్రహం పై రాళ్లతో దాడి

అనకాపల్లి పట్టణం గవరపాలెం అంబేద్కర్ నగర్లో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై రాళ్లతో దాడి చేసి కనుబొమ్మను పగలగొట్టారు. విషయం తెలుసుకున్న జనసేన సమన్వయకర్త భీమరశెట్టి రాంకి ఆదివారం ఘటన స్థలాన్ని సందర్శించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

April 26, 2026 / 11:34 AM IST