• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

ఎన్టీఆర్: విజయవాడ వన్ టౌన్ ఎస్ఐ భాగ్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన మద్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు. రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 5, 2026 / 10:07 AM IST

వడ్లపూడి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 10:03 AM IST

స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ATP: అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.240 గుంతకల్లులో రూ.240, స్కిన్‌లెస్ రూ.260 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు రిజ్వాన్ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి.

April 5, 2026 / 09:40 AM IST

సింగరకొండలో మృతదేహం కలకలం.. వ్యక్తి గుర్తింపుపై అన్వేషణ

బాపట్ల: అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం బయటపడటం ఆందోళన కలిగించింది. మినీ స్టేడియం సమీపంలోని రోడ్డుపై ఆదివారం ఉదయం శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 09:37 AM IST

శ్రీకాకుళం మీదుగా నడిచే రైళ్లకు అదనపు బోగీలు

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్-తిరుపతి మధ్య నడిచే రైళ్లకు ఒక 3 ఏసీ బోగీ అలాగే విశాఖ-గుణుపూర్-విశాఖ మధ్య నడిచే రైళ్లకు ఒక స్లీపర్ బోగీని మే 31 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

April 5, 2026 / 09:35 AM IST

‘అబ్దుల్ కలాం స్కూల్ ప్రవేశ పరీక్ష రద్దు’

KRNL: APJ అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్ ప్రవేశ పరీక్షను DEO ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు ఆ స్కూల్ HM హూసేన్, పెరెంట్స్ కమిటీ ఛైర్మన్ టి.బిల్కీస్ బాను ఇవాళ తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.100 ఎంట్రీఫీజు చెల్లించారని తెలిపారు. ఈ సొమ్మును తిరిగి ఇచ్చామన్నారు.

April 5, 2026 / 09:33 AM IST

బ్రిడ్జి లేక గ్రామాల ప్రజల కష్టాలు

E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, మిగతా కాలంలో పడవలే ఆధారమని గ్రామస్థులు చెబుతున్నారు. రూ.35 కోట్లతో ప్రారంభించిన వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బందులు పెరిగాయి. వరద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

April 5, 2026 / 09:30 AM IST

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

W.G: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఆచంట మండలం కొడమంచిలి అరుంధతిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. సామాజిక న్యాయ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయన భారత సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు.

April 5, 2026 / 09:20 AM IST

మండలంలో కర్మక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

CTR: పాకాల మండలం పెద్ద గోర్పాడు గ్రామంలో నిర్వహించిన కర్మక్రియలకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. గ్రామానికి చెందిన సూరినేని వెంకటరామ నాయుడు, గాలి రమేష్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 5, 2026 / 09:17 AM IST

బెలుము గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర కన్వెన్షన్ హాల్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

April 5, 2026 / 09:16 AM IST

రేపు గంగాధరనెల్లూరులో పీజీఆర్ఎస్

CTR: గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద రేపు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్‌గౌడ్ తెలిపారు. దీనిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

April 5, 2026 / 09:13 AM IST

మండపేటలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

కోనసీమ: ఈస్టర్ వేడుకలు మండపేటలో ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు తమ ఆత్మీయ మృతుల సమాధులు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్ ప్రకారం క్రీస్తు మృతి చెందిన తరువాత మూడోవ రోజు సమాధి నుంచి లేవబడతారు. ఆ రోజునే ఈస్టర్ గా క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారు. క్రైస్తవులు సమాధులను కొవ్వొత్తులు, పూలతో సుందరంగా అలంకరించి కుటుంబ సమేతంగా ప్రార్థనలు నిర్వహించారు.

April 5, 2026 / 09:13 AM IST

ఏపీలో సినీ పరిశ్రమకు బూస్ట్

GNTR: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చిత్రీకరణలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు కల్పిస్తూ, స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు రాయితీలు, భారీ చిత్రాలకు టికెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 09:12 AM IST

‘దోమల లార్వా ప్రభావిత ప్రదేశాలను గుర్తించాలి’

PPM: దోమల లార్వా ప్రభావిత ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా డ్రైడే నిర్వహించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. నిడగల్లు లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంటుందో అందుకు కారణాలు తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

April 5, 2026 / 09:08 AM IST

ఏటీఎంల వద్ద మోసాలపై ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం హెచ్చరించారు. అత్యవసరం పేరుతో నగదు తీసుకుని ఫోన్‌పే, గూగుల్ పే చేశామని చూపిస్తూ మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

April 5, 2026 / 09:05 AM IST