విశాఖలోని మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. కూటమి పాలనలో రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
TPT: పెళ్లకూరు (మం) చిల్లకూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి కుటుంబానికి ధైర్యం చెప్పారని తెలిపారు. ‘దెబ్బకు దెబ్బే మా సిద్ధాంతం’ అంటూ రాబోయే రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
CTR: డా.బీ.ఆర్. అంబేద్కర్ భవనంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ దేశసేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.
KDP: రోడ్డు కాంట్రాక్టు పనులు చేసే వారి నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని ఆర్కే వ్యాలీ CI శంకర్ తెలిపారు. వేంపల్లెలో బస్సు ప్రమాద ఘటనపై ఆయన మాట్లాడారు. రోడ్డు పనులు జరుగుతుంటే సూచికలు లేకపోవడం, డ్రైవర్ రోడ్డు మార్జిన్ చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సుకు విద్యుత్ వైర్లు తగలగానే లైన్ ట్రిప్ అవడంతో ప్రమాదం తప్పిందన్నారు.
ELR: బాబు జగ్జివన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఈరోజు పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాడారన్నారు.
KRNL: గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కె. ఈ శ్యాం కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తూ, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలంలో కామేపల్లిలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఆదివారం కిక్కిరిసింది అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తుల రాకతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అన్నమయ్య: మదనపల్లె మాదినకొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక శ్రీరాములు (35) అనే యువకుడు మద్యం సేవించి అడవిలో తన ఎడమ కాలును కొడవలితో నరికేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన నివాసం వద్ద స్వయంగా “మన రాజధాని – మన అమరావతి”అని ముగ్గులు వేసిమద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని కొనియాడారు.
ATP: రేపు జరగనున్న అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ఎంట్రీ పాస్ ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తామని, మొబైల్ ఫోన్లు అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. భద్రత దృష్ట్యా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఆడిటోరియంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ వేడుకలో 40,782 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వీసీ సుదర్శన్ రావు తెలిపారు.
TPT: ఉన్నత విద్యలో మార్పులపై తిరుపతి జిల్లా ఏఐఎస్ఎఫ్ నేత కోగిలి మునిచందు ఆందోళన వ్యక్తం చేశారు. APSCHE స్వయం ప్రతిపత్తి బలహీనపడుతోందని అన్నారు. ఒకే అధికారికి అధిక అధికారాలు ఇవ్వడం వల్ల అసమతౌల్యం వస్తుందని తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించాలని కోరారు.
GNTR: కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు, కార్మికులకు నష్టదాయకమని AIKMS జాతీయ కార్యదర్శి బి. భాస్కర్ అన్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ELR: భీమడోలు మానస స్కూల్ నందు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. వైద్యం అనేది వ్యాపారం కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన రంగమన్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో వైన్ షాపుల కారణంగా క్రైమ్ పెరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైన్ షాపులు నడుస్తున్నాయని, 24 గంటల పాటు దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.
పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య పనులు 24/7 నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రోడ్లు-కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రత్యేక అధికారి పాలనలో పట్టణాన్ని ముస్తాబు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.