• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పొంచి ఉన్న తాగునీటి సమస్య?

NDL: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి సమస్య తప్పేలా లేదు. మరో వారంలో శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజీకి పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 822.60 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 42.8047 టీఎంసీలకు చేరింది.

April 8, 2026 / 08:28 AM IST

ఎక్సైజ్ సీఐ హెచ్చరిక

KRNL: నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. బంగారుపేట పరిధిలో దాడులు నిర్వహించినట్లు నాటుసారా నిర్మూలనలో భాగంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి, నిఘా పెంచినట్లు తెలిపారు. ప్రజలకు దాని వల్ల కలిగే హానిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేయాలని కోరారు.

April 8, 2026 / 08:14 AM IST

మద్యం మత్తులో విధులు.. సెక్రటరీ సస్పెండ్

NDL: జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి నిన్నఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి, వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగ ఆల్కహాల్ స్థాయి అధికంగా నమోదైంది. దీంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

April 8, 2026 / 08:12 AM IST

ప్రతీ చెరువుకు నీళ్లిస్తాము: ఎమ్మెల్యే బీవీ

KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నెలో మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. స్థానిక చెరువును ట్రాక్టర్‌పై వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతీ చెరువుకు నీళ్లిస్తామన్నారు. పశువులకు తాగు నీరు, రైతుల పంటల కోసం ప్రతీ చెరువులో నీరు నిండుగా ఉంచుతామన్నారు.

April 8, 2026 / 08:07 AM IST

నేడు ఈ ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేత

తూ.గో: రాజమండ్రి మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శామ్యూల్ తెలిపారు. దీంతో జయకృష్ణపురం, బిజిలి ఐస్ ఫ్యాక్టరీ, గణేశ్ నగర్, కంబాల పార్క్, ఇన్కమ్ టాక్స్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

April 8, 2026 / 07:56 AM IST

‘తీర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు అవసరం’

BPT: అటవీ, పర్యావరణ చట్టాల అమలులో రాజీ ఉండకూడదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. చీరాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో మత్స్యకారుల జీవనాధారాన్ని దెబ్బతీయొద్దన్నారు. తీర ప్రాంతాల్లో రిసార్ట్‌లు, లేఔట్లకు అనుమతులు ఇవ్వడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. నియమాల ఉల్లంఘన ప్రమాదకరమని హెచ్చరించారు.

April 8, 2026 / 07:52 AM IST

కొత్త వ్యక్తుల సంచారం గమనించాలి: సీఐ

VZM: రాజాం CI అశోక్ కుమార్ మంగళవారం స్దానిక మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్లయితే కౌన్సిలింగ్‌ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల సంచారం గమనించి వారి వివరాలు సేకరించాలన్నారు

April 8, 2026 / 07:50 AM IST

లేపాక్షి ఏపీవోకు నోటీసులు జారీ

SS: లేపాక్షి మండల ఉపాధి హామీ అదనపు కార్యక్రమాధికారి (ఏపీవో) చంద్రశేఖర్‌కు డ్వామా ఏపీడీ శివానందనాయక్ నోటీసులు జారీ చేశారు. కూలీలకు పనులు కల్పించడం, ఎన్ఎంఎంఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మండలంలో 1937 మందికి పనులు కల్పించాల్సి ఉండగా, కేవలం 180 మందికే కల్పించినట్లు అధికారులు గుర్తించారు.

April 8, 2026 / 07:47 AM IST

ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల కేసు..

ELR: ద్వారకాతిరుమల నకిలీ టికెట్ల కేసులో అసలు దోషులను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈవో వద్ద పనిచేసిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

April 8, 2026 / 07:46 AM IST

రంగేపల్లిలో అవగాహన సదస్సు నిర్వహణ

SS: సోమందేపల్లి మండలం రంగేపల్లిలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప సమక్షంలో మంగళవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్థులకు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రొజెక్టర్ ద్వారా సమాచార వీడియోలను ప్రదర్శించారు. ప్రజల్లో చట్టాలు, భద్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం అని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు.

April 8, 2026 / 07:45 AM IST

ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ATP: యల్లనూరు మండలంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ చంద్రశేఖర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలోని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు రూ.150 ప్రభుత్వ రుసుం చెల్లిస్తే చాలన్నారు.

April 8, 2026 / 07:39 AM IST

గెలిస్తే రూ.1,20,000తో పాటుఎలక్ట్రికల్ స్కూటర్

KDP: కమలాపురం మండలం పెద్దచెప్పలిలో ఈనెల 18న ఎల్లమ్మ తిరుణాల మహోత్సవ సందర్భంగా ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలో మొదటి విజేతకు రూ.1,20,000, లతో పాటు ఎలక్ట్రికల్ స్కూటర్, 2వ బహుమతి రూ. లక్ష, 3వ బహుమతి రూ. 80,000, 4వ బహుమతి రూ.60,000, ఇలా వరుసగా 11 బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

April 8, 2026 / 07:39 AM IST

మహిళల హాకీ ఎంపిక పోటీలు

KRNL: కర్నూలు మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 10న జూనియర్ మహిళల హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హాకీ కోర్ కమిటీ సభ్యులు దాసరి సుధీర్ తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

April 8, 2026 / 07:37 AM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై ర్యాలీ

PPM: శాస్త్రీయ , వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారా ప్రజారోగ్యం సాధ్యమని , ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు పిలుపు నిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సంబంధిత అధికారులు పాల్గొని, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై హోరెత్తించారు.

April 8, 2026 / 07:35 AM IST

మెరుగైన విద్యా బోధన అందించాలి: కలెక్టర్

ASR: పాడేరు మండలం తలారిసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజతో కలిసి కలెక్టర్ టీ.నిశాంతి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా బోధనను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో వివిధ తరగతి గదులను సందర్శించారు. వారికి అందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు.

April 8, 2026 / 07:30 AM IST