TPT: తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
VZM: గజపతినగరం మండలంలోని తుమ్మి కాపల్లి గ్రామంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో మామిడి టేకు తోటలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన ఎస్ శంకర్ ఎస్ పైడితల్లి ఎస్ నారాయణప్పుడు కె తాతి నాయుడు కె నారాయణల కు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో గల మామిడి టేకు తోటలో కాలిపోవడంతో రూ. లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు తెలపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
KRNL: కౌతాళం మండలం వల్లూరు చెరువు వద్ద ఇవాళ “జలధార–జల హారతి” కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నీటి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ASR: రంపచోడవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో 13 ఇళ్లలో దొంగతనాలు చేసిన మజ్జి శివప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డతీగల ఎస్సై వినోద్ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ హేమంత్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 123 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.50 లక్షల విలువైన వెండి వస్తువులను కూడా రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.
KKD: గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండ రామస్వామి, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను వైఖానస ఆగమన ప్రకారం కోటిపల్లి గోదావరి నదిలో జలాధివాసం చేయనున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన రథం అన్నవరం చేరుకోవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ATP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ పి. జగదీష్ 169 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పిటిషన్ చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి.
NLR: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది టీడీపీ మాత్రమేనని, అందుకే మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా నిలబడ్డారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఈ నెల 15న మత్స్యకారులకు రూ.20 వేలు ఖాతాలో జమవుతుందన్నారు.
సత్యసాయి: గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కోరారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహనీయుల జయంతోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ గతిని మార్చిన ముగ్గురు గొప్ప నేతలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.
NTR: జీ. కొండూరులో కొలువుదీరిన కార్యసిద్ధి శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద నవధాన్యాలు సమర్పించారు. ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బ్యాక్ లాగ్ టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీతో పాటు సీ.పీ.టీ ఉత్తీర్ణతతో భర్తీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు ఎన్. వెంకటరవణప్ప తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు APPLY చేసుకోవాలని సూచించారు.
ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం డా.బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ స్కూల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును డీఎస్పీ శ్రావణ కుమార్ ప్రారంభించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
CTR: మండల స్థాయిలో పరిష్కరించగలిగిన అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వెదురుకుప్పం మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 158 వినతులను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అధికంగా అర్జీలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు తూము ద్వారా సాగునీరును మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, రైతులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో రైతుల భూములకు సాగునీరును విడుదల చేశామన్నారు. చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.