• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి

SKLM: వైసీపీ కుటుంబ సభ్యులు, మహిళలపై ఏబీఎన్ అధినేత ఈ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌‌లో రాధాకృష్ణపై సీఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా నైతిక విలువలను పాటించాలని అన్నారు.

April 9, 2026 / 10:11 PM IST

సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు డిమాండ్

KRNL: ఆదోనిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని SFI నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవాళ సమర్పించారు. ఎండ దెబ్బతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. బస్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 10:07 PM IST

ఉయ్యూరు దంత వైద్యశాలలో దోపిడి

కృష్ణా: ఉయ్యూరులో ఓ ప్రైవేట్ దంత వైద్యశాలలో దోపిడీ జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక పన్ను పీకటానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మెడికల్ సేవల పేరుతో అధిక రుసుములు తీసుకుంటున్నప్పటికీ, రోగులకు సరైన సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 09:40 PM IST

డోన్‌లో గేదెల కాపరి మృతి

NDL: డోన్ తారకరామనగర్ కాలనీలో బుజ్జికృష్ణకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ఇవాళ తెలిపారు. గేదెల పెంపకంతో జీవనం సాగించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బ్యాంకు రుణాల భారం తగ్గించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

April 9, 2026 / 09:39 PM IST

పట్టాదార్ పుస్తకాలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్

NTR: నందిగామ మండలంలోని రుద్రవరం, గొళ్లమూడి గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఇలాకీయా పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్ల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రీ-సర్వే నిర్వహించి, ప్రత్యేక క్యూఆర్ కోడ్, రాజముద్రతో డిజిటల్ పాస్‌పుస్తకాలను రూపొందించి అందిస్తోందని తెలిపారు.

April 9, 2026 / 09:38 PM IST

YS జగన్‌ను కలిసిన ఒంగోలు ఇంఛార్జి

ప్రకాశం: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాల గురించి జగన్‌కు ఆయన వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. పార్టీ బలోపేతంపై కృషి చేయాలని రవి బాబుకు జగన్ సూచించారు.

April 9, 2026 / 09:31 PM IST

రవాణా సేవల మెరుగుదల, ఆర్టీసీ బలోపేతంపై దృష్టి

అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.

April 9, 2026 / 09:21 PM IST

రవాణా సేవల మెరుగుదల, ఆర్టీసీ బలోపేతంపై దృష్టి

అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.

April 9, 2026 / 09:21 PM IST

యాజిలీ గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళం

BPT: యాజిల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి భట్టిప్రోలు మండలంలో జరిగిన సీఎం సభలో కోటి రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేశారు. P4లో భాగంగా తమ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు తన వంతు సహాయం అందజేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.

April 9, 2026 / 09:08 PM IST

దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గంలో దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను కోరారు. గురువారం తిరుపతికి వచ్చిన ఛైర్మన్‌కు స్వాగతం పలికిన అనంతరం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి దళితులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

April 9, 2026 / 09:04 PM IST

పిడుగు పడి కర్నూలు వాసి మృతి

PLD: సత్తనపల్లి కట్టవారిపాలెంలో గురువారం కురిసిన వర్షం, పిడుగు పాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వ్యవసాయ కూలీ పంట పొలంలో మిరపకాయల కోస్తూ.. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడని మిర్చి కోతకు వచ్చిన స్థానికులు తెలిపారు.

April 9, 2026 / 09:01 PM IST

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి

విశాఖలో 20 మంది ట్రాన్స్‌జెండర్లు గురువారం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. జీ‌వీఎంసీ స్వీపర్ ఉద్యోగాల్లో చేరిన వారికి 72 రోజుల జీతం జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సీపీని పూలమాల, శాలువాతో సత్కరించారు. ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవప్రద జీవనం సాధ్యమని సీపీ అన్నారు.

April 9, 2026 / 08:58 PM IST

నీటి భద్రతపై కలెక్టర్ సిరి దృష్టి

KRNL:‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సి.బెలగల్‌లో జిల్లా కలెక్టర్ సిరి, JC నూరుల్ ఖమర్ చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. నాగమ్మ చెరువును సందర్శించి నీటి నిల్వ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. సాగునీటి సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు నీటి వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

April 9, 2026 / 08:46 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ ఎస్‌ఐ రాజరాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిమితికి మించి ఎక్కించకూడదని, యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.

April 9, 2026 / 08:45 PM IST

గౌహతిలో పెనమలూరు ఎమ్మెల్యే పర్యటన

కృష్ణా: పెనమలూరు MLA  బోడే ప్రసాద్‌కు గౌహతిలో టీడీపీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాగుతుందని, అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.

April 9, 2026 / 08:45 PM IST