NDL: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దొంగతనం కేసును ఛేదించిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణకు ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతిభా పురస్కారం శుక్రవారం అందజేశారు. నిందితులను గుర్తించి స్వామివారి నగలను రికవరీ చేయడంపై ప్రశంసించారు. కేసులో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని కూడా అభినందించి అవార్డులు ప్రదానం చేశారు.
కృష్ణా: విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం చినఅవుటపల్లి, గొల్లపూడి మార్గాలే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెదురుపావులూరు–కేసరపల్లి మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 7 నుంచి 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
గుంటూరు జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలకు పోస్టింగులు కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. బదిలీలు, కొత్త పోస్టింగ్‌లలో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
VZM: గరివిడి మండల పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో కందిపేట ఫీడర్ నిర్వహణ పనుల నిమిత్తతం శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని EE త్రినాథ్‌రావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కందిపేట, కేఎల్ పురం, ఏనుగువలస, బాగువలస గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
WG: నరసాపురంలో వృద్ధుడిపై దాడికి పాల్పడిన బావిశెట్టి జ్యోతి బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న సైకిల్‌పై వెళ్తున్న పళ్ల సూర్యనారాయణను అడ్డుకున్న నిందితుడు, కూల్ డ్రింక్ బాటిల్తో దాడికి యత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో టౌన్ ఎస్సై ముత్యాలరావు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్ విధించారు.
ప్రకాశం: దర్శి మండలం పోతవరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిద్రించారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలో సాయంత్రం నుంచి గ్రామస్తుల సమస్యలను విన్నారు. కలెక్టర్‌గా కాకుండా వారిలో ఒకరుగా కలిసిపోయి గ్రామ సమస్యలతో పాటు గ్రామస్తుల వ్యక్తిగత సమస్యలను విన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
PLD: జాతీయ రహదారి 167AG పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కాంట్రాక్టరుకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. పిడుగురాళ్ల – సత్తెనపల్లి – పేరేచర్ల రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
VSP: ఉత్తర నియోజకవర్గంలో అసెంబ్లీ బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ, రాము, నజీర్, ఉషా కిరణ్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
KDP: మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారి నాగులపల్లె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం రాత్రి రోడ్డుపై మృతదేహం ఉండ టంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఏదైనా వాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు పడిపోయారా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తికి 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెప్పారు.
తూ.గో: రాజమండ్రి నగరంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక 30వ డివిజన్లోని బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
W.G: వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో శుక్రవారం వడదెబ్బతో రామాంజనేయులు (36) అనే యువకుడు మృతి చెందాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసిస్తూ, మద్యానికి బానిసైన రామాంజనేయులు, శుక్రవారం వడదెబ్బకు గురై గ్రామ సమీపంలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు చేరుకుని పరిశీలించేలోపే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.
NDL: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు.
కాకినాడ: ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ఫలితాలను ఇన్‌స్పెక్టర్ బి. సూర్య అప్పారావు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహించిన తనిఖీల్లో 29 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కోర్టు విచారణ అనంతరం నలుగురికి 3 రోజుల జైలు శిక్ష, మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఫైన్ వేశారు.