• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

13 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

KDP: సిద్దవటం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు SI హారిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో గురువారం దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

April 17, 2026 / 07:42 AM IST

కూటమి పాలనలో రైతుకు కన్నీరే: కాకాణి

NLR: కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో వరిగొండలో పర్యటించిన ఆయన గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

April 17, 2026 / 07:41 AM IST

స్డాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్

KKD: డిప్యూటీ సీఎం పవన్, నిహారికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్త వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 62/2026 U/S 356(2), 353(2), 79 BNS, 67 ITA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జోక్స్ పేరుతో ఎవరినైనా కించపరిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

April 17, 2026 / 07:20 AM IST

‘భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు’

SKLM: భార్యను తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జడ్జి కె. కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి M భరణికోటకి చెందిన ఎస్ .పద్మను భర్త జగ్గారావు 2021 లో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు SP తెలిపారు.

April 17, 2026 / 07:18 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులపై లోకేశ్ దృష్టి

గుంటూరు: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు విధానంపై పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

April 17, 2026 / 07:10 AM IST

3,106 చెరువుల్లో ఉపాధి పనులు: కలెక్టర్

CTR: ‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వల పెంపు, సాగునీటి బలోపేతం, కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

April 17, 2026 / 07:09 AM IST

‘సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

AKP: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నక్కపల్లి ఎంపీడీవో కే.చలపతిరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉపమాక పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

April 17, 2026 / 07:08 AM IST

వీధి శునకాల నియంత్రణకు మున్సిపల్ డ్రైవ్

NLR: కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాలతో వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ బృందం గురువారం సాయంత్రం కపాడిపాలెం, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు 5 వీధి శునకాలను బంధించి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువుల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

April 17, 2026 / 07:01 AM IST

పులివెందుల మున్సిపల్ కమిషనర్‌కు పదోన్నతి

KDP: పులివెందుల మున్సిపాలిటీలో ఇంఛార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న మునికుమార్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ముని కుమార్, ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 17, 2026 / 06:56 AM IST

సర్వేయర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

ATP: జిల్లా పరిధిలో భూ సర్వే పనులు వేగవంతం చేసేందుకు 247 లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) విష్ణు చరణ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొంది ఉండాలని, మూడేళ్ల లైసెన్స్ రెన్యువల్ కలిగి ఉండాలని తెలిపారు. 

April 17, 2026 / 06:50 AM IST

బానిసత్వానికి ముగింపు.. నలుగురికి స్వేచ్ఛ

బాపట్ల: చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన నలుగురిని అధికారులు వెట్టి వ్యవస్థ నుంచి విడుదల చేశారు. కర్లపాలెం ప్రాంతంలో ఓ వ్యక్తి వారి మీద బలవంతపు పని మోపుతున్నట్లు సమాచారం రావడంతో చర్యలు తీసుకున్నారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా వారికి విముక్తి పత్రాలు అందజేసి, స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు.

April 17, 2026 / 06:45 AM IST

ఆలయంలో హుండీ దొంగ అరెస్ట్

కోనసీమ: రాయవరం మండలం చెల్లూరులోని పురాతన అగస్తీశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడు మల్లేష్‌‌కు గురువారం కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 13న నిందితుడు ఆలయంలోని హుండీని పగలగొట్టి రూ.5వేల నగదుతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

April 17, 2026 / 06:44 AM IST

ఈనెల 24లోగా పూర్తిస్థాయి వైద్య పరీక్షలు: జిల్లా కలెక్టర్

ASR: జిల్లాలో పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి, ఈనెల 24లోగా పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ టీ.నిశాంతి గురువారం అధికారులను ఆదేశించారు. ఈమేరకు వైద్య బృందాలతో ప్రణాళికలను రూపొందించుకొని, బృందాలుగా పాఠశాలలను సందర్శించి, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. 14నుంచి 15ఏళ్ల లోపు బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లను అందించాలన్నారు.

April 17, 2026 / 06:43 AM IST

ఫోన్ చూడొద్దన్న తల్లి.. కుమార్తె ఆత్మహత్య

ATP: గుంతకల్లులోని దోనిముక్కల ప్రాంతంలో యాస్మిన్ (15) అనే బాలిక బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సెల్‌ఫోన్ చూడొద్దని తల్లి మందలించినందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 17, 2026 / 06:40 AM IST

స్వీయ గణనకు ప్రత్యేక పోర్టల్

AKP: స్వీయ గణనకు భారత ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు మునగపాక తహసిల్దార్ సత్యనారాయణ తెలిపారు. గురువారం మాట్లాడుతూ.. దీని ద్వారా కుటుంబ వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చునన్నారు. అప్లోడ్ అప్ లోడ్ చేసుకున్న తర్వాత వచ్చే ఐడీ నెంబర్ ను భద్రపరచుకోవాలన్నారు. ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లుకు ఐడీ నెంబర్ చెప్పాలన్నారు.

April 17, 2026 / 06:40 AM IST