• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మలేరియా నివారణకు అవగాహన ర్యాలీ

అన్నమయ్య: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దోమతెరలు వినియోగించడం, వేపాకు పొగ వాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 25, 2026 / 06:26 PM IST

‘ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి’

CTR: గుడిపాలలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంఘమిత్రులతో సమావేశమై ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. అనంతరం సంఘమిత్రలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

April 25, 2026 / 06:26 PM IST

మహంకాళి అమ్మవారి లక్ష విరాళం

PLD: నరసరావుపేట మండలం, ఇస్సపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పెద్ద శ్రీనివాసరావు, దేవి కుమారుడు దినేష్ వెంకట సాయి మానస దంపతులు కలిసి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్‌, ఈవో మాధవిదేవికి అందజేశారు.

April 25, 2026 / 06:26 PM IST

స్వీయ గణనపై అవగాహనకు 5K రన్

E.G: జనగణన–2027లో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ 26న వై.జంక్షన్ వద్ద నుంచి 5K రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం ఉందన్నారు.

April 25, 2026 / 06:25 PM IST

పట్టణంలోకి భారీ వాహనాలు నిషేధం

ఏలూరు పట్టణంలోకి భారీ మరియు రవాణా వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతులు లేవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. అనుమతుల లేకుండా భారీ వాహనాలు పట్టణంలోకి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.

April 25, 2026 / 06:16 PM IST

ముగిసిన గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్

ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో శనివారం జరుగుతున్న గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం తనయుడు గుత్తి, పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్‌ను ఆడారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు.

April 25, 2026 / 06:11 PM IST

మార్కాపురం నుంచి బ్రహ్మంగారిమఠంకి RTC సర్వీసులు

ప్రకాశం: కడప జిల్లా పోరుమామిళ్లలో జరుగుతున్న బ్రహ్మంగారిమఠం ఆరాధనల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మార్కాపురం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిపో నుంచి మఠం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. బస్సుల సమయాలు, ఇతర వివరాల కోసం ఎంక్వయిరీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

April 25, 2026 / 06:09 PM IST

అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ELR: కైకలూరు నియోజకవర్గం స్థాయిలో వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తకూడదు, రెండు పూటలు పుష్కలంగా ఇవ్వాలి. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.

April 25, 2026 / 06:05 PM IST

GGH విద్యార్థినుల హాస్టళ్లలో కలెక్టర్ తనిఖీలు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మెడికల్ కళాశాల విద్యార్థినుల హాస్టళ్లను శనివారం జిల్లా కలెక్టర్ డా.సిరి తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, భోజనశాల, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. DMHO వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు.

April 25, 2026 / 05:49 PM IST

డ్రగ్స్ వద్దు బ్రో అవగాహనకు వేగం

అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1972పై సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే కేసులు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

April 25, 2026 / 05:46 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిను పరిశీలించిన కలెక్టర్

ELR: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్ళకుండా చూడాలన్నారు.

April 25, 2026 / 05:44 PM IST

కాణిపాకంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయం వెలుపల భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, కూలింగ్ ఏర్పాట్లు పరిశీలించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యూలైన్లలో మంచినీరు, ఫ్యాన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.

April 25, 2026 / 05:43 PM IST

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం

E.G: జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మీ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిట్ & రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. రెవెన్యూ & పోలీసు అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.

April 25, 2026 / 05:43 PM IST

కనేకల్లులో మహిళా భద్రతపై అవగాహన

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.

April 25, 2026 / 05:38 PM IST

చిలకపాటి భరద్వాజాచార్యుల మృతికి చదలవాడ నివాళులు

PLD: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో కీ.శే. చిలకపాటి భరద్వాజాచార్యుల అకాల మరణంపై నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి సేవలను గుర్తుచేసుకున్నారు.

April 25, 2026 / 05:36 PM IST