• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

BPT: చీరాల మండలంలోని దేశాయిపేటలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి పొంగళ్ల కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

May 30, 2026 / 10:41 PM IST

పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ల పరామర్శ

కోనసీమ: మండపేట మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ద్వారపూడి గ్రామంలో మాజీ జెడ్పిటీసీ తులా రంగారావు, అనమాల రాము, ఆకుమర్తి సుబ్బారావు, అర్తమూరు గ్రామంలో మండా వెంకటరెడ్డి, సబ్బెళ్ళ రామారెడ్డి, ఏలేటి గణపతి, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

May 30, 2026 / 10:00 PM IST

పేకాట ఆడుతున్న 20 మంది అరెస్ట్

ప్రకాశం: ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 20 మందిని శనివారం స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.17,350 నగదు 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని సీఐ భీమా నాయక్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

May 30, 2026 / 09:46 PM IST

గణేకల్లులో రోడ్డు ప్రమాదం.. మృతిపై సంతాపం

KRNL: గణేకల్లు గ్రామానికి చెందిన బల్లెకల్లు వీరేష్, తలారి మహేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఇవాళ టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. ఆదోని ఏరియా ఆసుపత్రికి చేరుకుని అధికారులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా పూర్తి చేయాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

May 30, 2026 / 09:33 PM IST

అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా విశాఖ అభివృద్ధి

విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. కైలాసగిరి, జూ పార్క్, కంభాలకొండ, తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నైట్ సఫారీ వంటి సదుపాయాల ఏర్పాటు చేయనున్నామన్నారు.

May 30, 2026 / 09:32 PM IST

పాముకాటుకు 11 ఏళ్ల బాలుడి మృతి

CTR: బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామానికి చెందిన కిరణ్ (11) శాంతిపురం మండలంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కిరణ్ శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా విష సర్పం కాటేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందాడు.

May 30, 2026 / 09:28 PM IST

మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

NTR: వీరులపాడు మండలంలోని జగన్నాధపురం, జమ్మవరం గ్రామాల్లో శనివారం సాయంత్రం ఎస్సై అభిమన్యు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.

May 30, 2026 / 09:22 PM IST

‘మురుగునీటి సమస్య పరిష్కరించాలి’

CTR: సదుం ఉస్మాన్ సాహెబ్ సందులో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తున్నట్టు స్థానికులు ఈవో చలపతికి శనివారం ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా సమస్య నెలకొందని.. దీనిపై ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని చికిత్సకు వేలాది రూపాయల ఖర్చు అవుతున్నాయని వెల్లడించారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

May 30, 2026 / 09:21 PM IST

కర్మయోగి పోర్టల్‌ కోర్సులపై జేసి సమీక్ష

W.G: ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి 48 కోర్సులు పూర్తి చేయాలని, డీడీవోలు దీనిపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

May 30, 2026 / 09:17 PM IST

ప్రొఫెషనల్ టాక్స్ బకాయిలపై నోటీసులు జారీ.!

KDP: ప్రొద్దుటూరులోని విద్య,వైద్య,వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు చెల్లించాల్సిన ప్రొఫెషన్ టాక్స్ బకాయిలపై శనివారం స్థానిక స్టేట్ GST అధికారులు నోటీసులు ఇచ్చారు. CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో DCTO, ACTO, సిబ్బంది యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్రొఫెషనల్ టాక్స్ చెల్లింపుపై వారికి అవగాహన కల్పించారు.

May 30, 2026 / 09:17 PM IST

పెద్ది ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

NTR: జూన్ 1న జరగనున్న ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఇందిరా గాంధీ స్టేడియం పరిసరాలను ఎంపీ కేశినేని చిన్ని,సెంట్రల్ ఏసీపీ దామోదర్ పోలీసు అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సినీ ప్రముఖులు, వీఐపీలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

May 30, 2026 / 09:10 PM IST

స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం

ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జూన్ 9న ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

May 30, 2026 / 09:09 PM IST

గుండెలపై చంద్రబాబు బొమ్మతో వీరాభిమాని

KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటకు చెందిన బోడికే ఓబుల నాయుడు టీడీపీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. గుండెలపై సీఎం చంద్రబాబు ఫొటోను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయనకు చంద్రబాబు కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందని స్థానికులు చెబుతున్నారు.

May 30, 2026 / 09:06 PM IST

వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ

AKP: ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్పించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సూచించారు. శనివారం నక్కపల్లిలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. పార్టీ సానుభూతి ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలన్నారు.

May 30, 2026 / 09:03 PM IST

ముగిసిన జాతీయ ట్రెక్కింగ్ క్యాంప్

ASR: అరకులో నిర్వహించిన జాతీయ ట్రెక్కింగ్ క్యాంప్ శనివారంతో ఘనంగా ముగిసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్ సీసీ క్యాడెట్లు, యువ ట్రెక్కర్లు పట్టుదల, ధైర్య సాహసాలతో కఠినమైన కొండ మార్గాల్లో ప్రయాణించి ఐక్యత, క్రమశిక్షణ చాటి చెప్పారని ఎన్ సీసీ కమాండెంట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ట్రెక్కర్లను అభినందించి, బహుమతులు అందజేశారు.

May 30, 2026 / 09:02 PM IST