• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ స్టేట్ ఆర్టిజన్ సెల్ సెక్రటరీగా బూసిరెడ్డి

ప్రకాశం: జిల్లా వైసీపీలో పలు కీలక నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జరుగుమల్లికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత దగ్గుమాటి బూసిరెడ్డిని వైసీపీ స్టేట్ ఆర్టిజన్ సెల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి బూసిరెడ్డిని ఎంపిక చేయడం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 07:29 PM IST

‘జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె’

VSP: జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు తమ జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. పారిశుద్ధ్య, డే నైట్, ప్యాకేజీ వర్కర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. శనివారంలోగా జీతాలు అందకపోతే, ఈనెల 20 (సోమవారం) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు.

April 16, 2026 / 07:25 PM IST

నందిగామలో భానుడి భగభగలు

NTR: నందిగామ నియోజకవర్గంలో గురువారం ఎండలు తీవ్రంగా పెరగడంతో భానుడు భగభగలాడాడు. నందిగామలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో 41 డిగ్రీలుగా నమోదైంది. ఎండల తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో బయటికి రావడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.

April 16, 2026 / 07:20 PM IST

జంగిల్ క్లియరెన్స్ చేయాలని డిమాండ్

PPM: జంఝావతి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ నాయకులు ఇవాళ డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తదితరులు పట్టణంలో ఉన్న కాలువను పరిశీలించి ఖరీఫ్ సీజన్‌కు ముందు పనులు చేపట్టాలని కోరారు. వేసవిలోనే పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు.

April 16, 2026 / 07:19 PM IST

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్

SKLM: ఇచ్చాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పురుషోత్తపురం గ్రామంలో షిర్డీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

April 16, 2026 / 07:15 PM IST

డుంబ్రిగూడ మండలంలో గ్రామసభ

ASR: డుంబ్రిగూడ, కొర్రాయి, అరకు, గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామ సభ తీర్మానాల మేరకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరమ్మతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఆర్వో, ఎంపీడీవోలతో కలిసి జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

April 16, 2026 / 07:14 PM IST

‘యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలు’

విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ల ఆలస్యం, పరిశ్రమల లేమి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదన్నారు.

April 16, 2026 / 07:12 PM IST

ఢిల్లీలో ఉమ్మడి జిల్లా మహిళ ప్రజా ప్రతినిధుల సందడి

VZM: దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు ఇవాళ సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు. ఇందులో ఇంఛార్జ్ మినిస్టర్ అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, నాగమాధవి ఉన్నారు.

April 16, 2026 / 07:11 PM IST

ఎఫ్పీఓల ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు: కలెక్టర్

ATP: జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీఓలు) పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడంపై యంత్రాంగం దృష్టి సారిస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కూడేరు మండలం ముద్దలపురంలోని రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీని ఆయన సందర్శించారు. మే 1 నుంచి జిల్లాలోని 200కు పైగా ఎఫ్పీఓల ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు.

April 16, 2026 / 07:10 PM IST

ఉండవల్లి గుహల వద్ద రోడ్డు ప్రమాదం

GNTR: ఉండవల్లి గుహల మలుపు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

April 16, 2026 / 07:06 PM IST

‘అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలి’

AKP: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలని కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జీఎంఎస్‌కేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడిపందేలు, ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, జూదం ఎక్కడైనా జరిగితే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.

April 16, 2026 / 07:06 PM IST

చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్

BPT: చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్ బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడతామని, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

April 16, 2026 / 07:03 PM IST

కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి: ఎమ్మెల్యే

KRNL: తుగ్గలి మండలంలో చెరువు తాండాలో రూ.26.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఇవాళ ఎమ్మెల్యే కేయి శ్యాంకుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. గిరిజన తాండాల అభివృద్ధిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షితులై కొందరు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించారు.

April 16, 2026 / 07:01 PM IST

శ్రీ చిరాలమ్మ తల్లి ప్రత్యేక పూజలో తుడా ఛైర్మన్

TPT: శెట్టిపల్లి గ్రామంలో శ్రీ చిరాలమ్మ తల్లి 31వ జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటు ఆనందంతో గ్రామస్తులు ఆయనను సన్మానించారు. ఈ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 16, 2026 / 07:00 PM IST

వలేటివారిపాలెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం

NLR: వలేటివారిపాలెం మాలకొండ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు మొదటి వెయ్యి రోజులు శిశువు అభివృద్ధికి కీలకమని తెలిపారు. చిన్న పిల్లలకు మొబైల్, TV వినియోగం తగ్గించి, ఆరుబయట ఆటలకు ప్రోత్సహించాలన్నారు.

April 16, 2026 / 07:00 PM IST