• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీ

సత్యసాయి: పరిగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీతోపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. శక్తి యాప్, 100, 112 వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

April 22, 2026 / 12:43 PM IST

భానుడి ప్రతాపం.. ఇంట్లో జనం

ATP: జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి వేడి గాలులు మొదలై, రాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతోంది. ఎండల ధాటికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

April 22, 2026 / 12:39 PM IST

చురుగ్గా తాండవ రహదారి నిర్మాణ పనులు

AKP: నాతవరం నుంచి తాండవకు వెళ్లే 7 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు అధ్వాన్నంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ.3.5 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణం వేగవంతం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 22, 2026 / 12:29 PM IST

వాకర్స్‌పై యూజర్ చార్జీలు రద్దు చేయాలి: సీపీఐ

VSP: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా జరిగింది. పార్కులు, స్టేడియాల్లో వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీలు విధించడం ప్రజా వ్యతిరేకమని జిల్లా కార్యదర్శి ఎస్‌కె రహమాన్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

April 22, 2026 / 12:25 PM IST

బాధితులకు ఆర్థిక సాయం అందజేత

ELR: ముసునూరులో ఇళ్ళు అగ్నికి ఆహుతైన ఘటనలో బాధితులకు అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వెంకట రవీంద్ర బుధవారం ఆర్థిక చేయూత అందించారు. నిత్యవసర సరుకులు,10 వేల రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి నరసింహారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నేత కొండేటి ఉదయ్ కిరణ్, చీలి అర్లప్ప, లక్కపాము కాంతారావు పాల్గొన్నారు.

April 22, 2026 / 12:13 PM IST

కొత్తపోలమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే

PPM: ఈ నెల 26 నుంచి 29 వరకు కొత్తవలసలో శ్రీ కొత్త పోలమ్మ అమ్మవారి పండగ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇవాళ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పండగలో చేపట్టనున్న ఘటాల ఊరేగింపునకు రావాలంటూ స్థానిక MLA బోనెల విజయచంద్రను ఆయన కార్యాలయంలో కలసిన ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసారు.

April 22, 2026 / 12:06 PM IST

గ్రామీణ యువతులకు ఉచిత నైపుణ్య శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో యువతులకు బ్యూటీ పార్లర్, కుట్టు పనిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. మే 6 ప్రారంభమయ్యే ఈ 35 రోజుల కోర్సులో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు 97105091727, 9391486269 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.

April 22, 2026 / 12:06 PM IST

పుల్లలరేవులో కొత్త రహదారుల ప్రారంభం

ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పుల్లలరేవు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రూ.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అలాగే గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకు రూ.1.30 కోట్ల ఏపీఆర్‌ఆర్‌పీ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.

April 22, 2026 / 12:02 PM IST

ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం

AKP: ప్రజలకు మెరుగైన పాలన, అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో సింగపూర్ లో పర్యటిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండవ రోజు సింగపూర్ హోం మమంత్రి షణ్ముగంతో సమావేశమై శాంతిభద్రతల నిర్వహణ, చట్టాలు అమలుపై చర్చించడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రణాళికలు, భూపాలనపై శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆ దేశ 50 ఏళ్ల ప్రగతిని అధ్యాయం చేస్తున్నట్లు చెప్పారు.

April 22, 2026 / 12:01 PM IST

చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలి: డాక్టర్

CTR: వేసవిలో ఎండ తీవ్రతతో చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ అలసట, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్ చిన్న పిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. బుధవారం అయన మాట్లాడుతూ.. పిల్లలకు దాహం వేయకపోయినా తరచూ మంచి నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, లేదా పండ్ల రసాలు ఇస్తుండాలన్నారు. జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.

April 22, 2026 / 12:01 PM IST

చీటీల పేరుతో భారీ మోసం

సత్యసాయి: ముదిగుబ్బలో చీటీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశచూపి ఓ వ్యక్తి పలువురి నుంచి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న నగదు తిరిగి ఇవ్వకుండా బాధితులను నట్టేట ముంచాడు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.

April 22, 2026 / 12:01 PM IST

ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: సర్వేపల్లి నియోజకవర్గంలోని వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు మంజూరయ్యాయి. ముత్తుకూరులో ఇవాళ జరిగిన కార్యక్రమంలో MLA సోమిరెడ్డి చేతుల మీదుగా అందరికీ పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్లపై తామే నిలబడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పొదుపు గ్రూపులను 1994లో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిని మోడల్‌గా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని చెప్పారు.

April 22, 2026 / 12:01 PM IST

‘నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి’

ELR: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. బుధవారం చింతలపూడి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను పలు మండలాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఆర్థికేతరమైన అంశాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

April 22, 2026 / 11:58 AM IST

‘వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు’

KDP: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి నాగ స్వర్ణ లత బుధవారం తెలిపారు. ప్రత్యేక తరగతుల పేరుతో తరగతులు నిర్వహించిన, అడ్మిషన్లు ప్రారంభించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 22, 2026 / 11:53 AM IST

పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గుత్తి వాసులు

ATP: గుత్తికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్రను, మనోహర్‌ను పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా నియమించినట్లు ఏపీ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

April 22, 2026 / 11:43 AM IST