కోనసీమ: స్వచ్ఛ మండపేట సాధనే లక్ష్యంగా పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ టీవీ రంగారావు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ప్రతిరోజూ రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు రహదారులపై బహిరంగంగా చెత్త వేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KRNL: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను ఆయన తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్ల వరకు డీబార్ చేస్తామని హెచ్చరించారు.
గుంటూరు: అరండల్‌పేటలో బంగారం వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించాలంటూ నమ్మబలికి ఓ మహిళ వ్యాపారి వద్ద నుంచి రూ.19 లక్షల నగదు, రూ.4 లక్షల విలువైన ఆభరణాలు తీసుకుంది. తరువాత వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై అధికారులతో శనివారం సమావేశమయ్యారు. భూ తగాదాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిచేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.
AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డంపాలెం గ్రామంలో కొవ్వూరు సుబ్బరాజు అనే సాధువు తనకు వీలునామా రాసిన మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నట్లు రైతు సుబ్బన్న తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధువు గత ఏడాది మృతిచెందే ముందు ఆయనకు సంబంధించిన భూమిని తన పేరు మీద వీలునామా రాసినట్లు తెలిపారు.
VZM: అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభలలో బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్దాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం రాత్రి గజపతినగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన టీడీపి నాయకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
అన్నమయ్య: గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అయిన డాక్టర్ రఫీని డీఎంహెచ్ సస్పెండ్ చేశారు. ఇటీవల కలెక్టర్ నిశాంత్ తనిఖీలో ఆయన ఆస్పత్రిలో లేకపోవడం, అటెండెన్స్‌లో సంతకం చేసి వెళ్లిపోవడం గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగి మనోజ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎస్ పురంలో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, ఐక్యతతో క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.
NDL: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్-లైన్ బెట్టింగ్‌లపై నిఘా ఉంచామని తెలిపారు. బెట్టింగ్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసి, ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
GNTR: జిల్లా సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన బడ్జెట్ అవుట్‌రీచ్ ఈవెంట్-2026-27లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
VSP: గాజువాకలో ఇటీవలే నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో దారుణహత్యకు గురైన మౌనిక హత్య కేసును జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని శనివారం పెద్దఎత్తున మహిళ సంఘాలు, దళిత ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపి, మౌనికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ELR: అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ పోలవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు శనివారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. తన నివాసం వద్ద దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయం గెలిచిందని, అమరావతి నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం ప్రజలందరి ఆకాంక్ష అన్నారు.
KRNL: టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శనివారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. కర్ణాటక రాష్ట్రం సిందనూరు తాలూకాలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ATP. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి ఆమె దీపాలు వెలిగించి వేడుకలు జరిపారు. ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం అని కొనియాడారు. రాజధానిపై వైసీపీ నేతలు విషం కక్కడం మానాలని హితవు పలికారు.
ప్రకాశం: దోర్నాల మండలం జమ్మి దోర్నాల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిది దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు ఆవులయ్యగా గుర్తించారు. మృతుడు మతిస్థిమితంలేక తిరుగుతుంటాడని సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.