• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డివైడర్‌పైకి దూసుకు వెళ్లిన కంటైనర్

ప్రకాశం: టంగుటూరులోని కొండపి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు కంటైనర్ లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తారు.

April 13, 2026 / 06:42 PM IST

‘అమ‌రావ‌తి యోగా’ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

NTR: ఆనంద‌మ‌య జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ఆన్‌లైన్ యోగా అద్భుత అవ‌కాశ‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేష‌న్ హాల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ‘అమ‌రావ‌తి యోగా’ యూట్యూబ్ ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను ప్రారం...

April 13, 2026 / 06:40 PM IST

డయల్ యువర్ సీఎండీకి 45 వినతులు

VSP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ నిర్వహించిన ‘డయల్ యువర్ APEPDCL సీఎండీ’ కార్యక్రమంలో 45 వినతులు అందాయి. లో-వోల్టేజ్, బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ మార్పులు, సోలార్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వాటిని పరిశీలించి తక్షణ చర్యలకు ఆదేశించారు.

April 13, 2026 / 06:40 PM IST

దేశ వ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ విస్తరణ

VZM: దేశవ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ విస్తరణకు ప్రతి ఒక్క మెగా అభిమాని కృషి చేయాలని మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్‌లో ఈ సమావేశం ఇవాళ నిర్వహించారు. చిరంజీవికి దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారని, అభిమానులంటే ఆయనకూ ప్రత్యేకమైన అభిమానముందని తెలిపారు.

April 13, 2026 / 06:40 PM IST

జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS

గుంటూరు జిల్లా పోలీసు శాఖ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని PGRS నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు.

April 13, 2026 / 06:40 PM IST

ఐతం విద్యార్థులకు ఉద్యోగాలు

SKLM: టెక్కలిలో ఉన్న ఐతం కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2026లో గ్రాడ్యుయేట్ అయిన 9 మంది విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. వీరికి ప్రారంభ వార్షిక వేతనం రూ. 3.19 లక్షలు అందనుంది. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.

April 13, 2026 / 06:40 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్త్రీ శక్తి” కార్యక్రమం నిర్వహణ

KDP: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ స్మిత ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత సెల్ కన్వీనర్ శివమ్మ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు విద్యార్థినులకు విలువైన సూచనలు అందించగా, కార్యక్రమం మహిళా సాధికారతకు ప్రేరణగా నిలిచింది.

April 13, 2026 / 06:34 PM IST

అంబేద్కర్ జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో ఇవాళ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయన జీవిత చరిత్రపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇంఛార్జ్ హెచ్ఎం సుకుమార్ తెలిపారు. విజేతలకు రేపు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ టీచర్ ఎస్ కిషోర్ పాల్గొన్నారు.

April 13, 2026 / 06:30 PM IST

నరసన్నపేటలో వైసీపీ బూత్ కమిటీల సమావేశం

SKLM: నరసన్నపేటలో వైసీపీ బూత్ కమిటీల సమావేశం ఇవాళ చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ యువ నాయకులు కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా రూపకల్పన అత్యంత కీలకమని, ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 06:30 PM IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ వాయిదా

E.G: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులైన ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కేసు నుంచి తమను తప్పించాలని రాజమండ్రి కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉభయ పక్షాల వాదనలు విన్న రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.

April 13, 2026 / 06:30 PM IST

రేపు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

VZM: రాజ్యాంగ నిర్మాత, ‘భారతరత్న’ బాబా సాహెబ్ డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జేసీ సేధు మాధవన్ ఇవాళ తెలిపారు. ఉదయం 10 గంటలకు బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలాలంకరణ జరుగుతుందన్నారు.

April 13, 2026 / 06:30 PM IST

రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి

NLR: రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును ఆమోదించినందుకు మంత్రి నారా లోకేశ్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటాన్ని, వారి త్యాగాలను గుర్తు చేసుకున్న నేతలు, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.

April 13, 2026 / 06:30 PM IST

అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ అందజేత

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ దివ్యాంగుడికి తక్షణమే ఊరట లభించింది. గోరంట్ల మండలానికి చెందిన హుస్సేన్ పీరా మూడు చక్రాల సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెంటనే స్పందించారు. అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు.

April 13, 2026 / 06:30 PM IST

తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

ATP: కంబదూరు పాత ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని కాలి బిందెలతో ముట్టడించారు. కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 06:30 PM IST

‘నీటి భద్రతపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది’

PLD: నీటి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను ప్రజలు ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 06:25 PM IST