కోనసీమ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. సోమవారం మండపేటలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి చంద్రశేఖర్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు.
SKLM: రణస్థలం మండల కేంద్రంలోని డా. బీ ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరించుకుని మంగళవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర రావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే గొప్ప పునాది అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ రెడ్డి హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.
VSP: బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు మల్లయ్యపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి CPI నేతలు నివాళులు అర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.పైడిరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.బేగం, వి.సత్యనారాయణ, ఇ.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
TPT: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపినట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు. తిరుపతి SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నేండ్రగుంట హైవే పై అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలను తనిఖీలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణాలు చాలా విలువైనవని, తాగి వాహనం నడపడం చట్టరిత్యా నేరమన్నారు.
ELR: బీసీ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్యార్ధులతో కాసేపు ఆయన ముచ్చటించారు.
ఏలూరు తంగెళ్లమూడిలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆహర నాణ్యత, సిబ్బంది ప్రవర్తనను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగారు. అనంతరం క్యాంటీన్‌ల పరిసరాలలో పరిశుభ్రతను పరిశీలించారు.
NTR: నందిగామ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో చందర్లపాడు బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎక్సైజ్ సీఐ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత నిద్ర మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి, నీళ్లతో ముఖం కడిగించి జాగ్రత్తలు సూచిస్తూ పంపిస్తున్నారు. డ్రైవర్లు తమ కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అప్రమత్తంగా వాహనాలు నడపాలన్నారు.
CTR: ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించిన ఓ బాలికను కార్వేటినగరం పోలీసులు కాపాడారు. మండలానికి చెందిన ఓ బాలిక తనకు జీవితం మీద ఆసక్తి లేదని ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో నిన్న రాత్రి పోస్ట్ చేసింది. సోషల్ మీడియా సెల్ పోలీసు సిబ్బంది కార్వేటినగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సీఐ హనుమంతప్ప సాంకేతిక పరిజ్ఞానంతో 15 నిమిషాల్లో బాలిక ఆచూకీ కనిపెట్టారు.
VZM: పిజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కు వేదికగా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జె. సి.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పి.జీ.ఆర్.ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన డిఆర్వో సత్తిబాబు, ఇతర అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు.
W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడు విచ్చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిటి నాయుడు, రవితేజ, వల్లి ఉన్నారు.
AKP: అచ్యుతాపురం కేజీబీవీలో బాలిక మృతి చెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. కమిటీలో ఎలమంచిలి, కె. కోటపాడు ఎంఈఓలు సూర్యప్రకాష్, ప్రసాద్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని జెనీమా ఉన్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్సు శుక్ల అధ్యక్షతనలో విద్యుత్ శాఖ అధికారులతో సోమవారం పీఎం కుసుమ్ పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ పథకం అమలుకు 437 ఎకరాల భూమిని గుర్తించగా, 215 ఎకరాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 22 ఎకరాలను త్వరలో స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.